News February 24, 2025
టన్నెల్ ఘటన.. ‘నీరో చక్రవర్తి’లా రేవంత్ వ్యవహారం: కేటీఆర్

TG: SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో 8 మంది ఆచూకీ తెలియని స్థితిలో MLC ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ నిమగ్నమవ్వడం దిగజారుడు రాజకీయమేనని కేటీఆర్ విమర్శించారు. ఈ ఘటనపై సీఎంకే సీరియస్‌నెస్ లేకపోతే అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అని నిలదీశారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా రేవంత్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు.
Similar News
News February 24, 2025
50 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

TG: SLBC టన్నెల్ ఘటనలో 8 మంది చిక్కుకొని 50 గంటలు దాటింది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురద పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో రెస్క్యూ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. బురదలో ఉన్న వ్యక్తులను గుర్తించే అత్యాధునిక పరికరాలతో గాలిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌లో సేఫ్ కంటైనర్‌లోకి కార్మికులు వెళ్లుంటే ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు.
News February 24, 2025
SVSCలో పెద్దోడు, చిన్నోడు పేర్లివే!

టాలీవుడ్ బెస్ట్ క్లాసిక్‌లలో ఒకటైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా మరోసారి థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన వెంకటేశ్, మహేశ్‌బాబుల క్యారెక్టర్ల పేర్లు రివీల్ అయినట్లు తెలుస్తోంది. పెద్దోడు, చిన్నోడు క్యారెక్టర్లకు పెట్టిన పేర్లివే. పెద్దోడు సిరి మల్లికార్జునరావు, చిన్నోడు సీతారామ రాజు అని IMDలో పేర్కొన్నారు. దీనిని ఇరు హీరోల ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
News February 24, 2025
YCPకి ప్రతిపక్ష హోదా రాదు: Dy.CM పవన్

AP: ‘ఈ ఐదేళ్లలో YCPకి ప్రతిపక్ష హోదా రాదు.. ఇది గుర్తుపెట్టుకోవాలి’ అని Dy.CM పవన్ తేల్చిచెప్పారు. 11 సీట్లు ఉన్న YCPకి ఆ హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వచ్చేదన్నారు. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లాలంటూ ఎద్దేవా చేశారు. హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం, లేకపోతే ప్రసంగాలను అడ్డుకుంటామనడం సరైన పద్ధతి కాదని చెప్పారు.