News July 3, 2024
క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన తుర్కియే, నెదర్లాండ్స్

యూరో ఛాంపియన్ షిప్లో తుర్కియే, నెదర్లాండ్స్ క్వార్టర్స్ దూసుకెళ్లాయి. నిన్న రొమేనియాతో జరిగిన మ్యాచులో నెదర్లాండ్స్ 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం నెదర్లాండ్స్ ప్లేయర్ల డామినేషనే కొనసాగింది. మరో మ్యాచులో ఆస్ట్రియాపై తుర్కియే 2-1తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు ప్లేయర్ మెరిహ్ డెమిరల్ రెండు గోల్స్ చేయడం గమనార్హం. ఈ నెల 5 నుంచి 7 వరకు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచులు జరగనున్నాయి.
Similar News
News November 10, 2025
CNG కాదు.. ఆత్మాహుతి దాడేనా?

<<18252445>>ఢిల్లీ పేలుడు<<>> ఘటనకు CNG కారణమని తొలుత భావించారు. కానీ CNG పేలితే ఇంత భారీ తీవ్రత ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది ఉగ్రవాద దాడి లేదా ఆత్మాహుతి దాడి అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద సంస్థ ఈ పేలుడుకు బాధ్యత తీసుకుంటూ ఏ ప్రకటన చేయలేదు.
News November 10, 2025
మార్కెట్‌కు సెలవు: పెను ప్రమాదమే తప్పింది!

ఢిల్లీలో జరిగిన భారీ పేలుడులో పెను ప్రమాదమే తప్పింది. బ్లాస్ట్ జరిగిన ఎర్రకోట మెట్రో సమీపంలోని చాందినీ చౌక్‌లో ఓల్డ్ లజపత్ రాయ్ మార్కెట్ ఉంటుంది. సహజంగా ఆ మార్కెట్ అత్యంత రద్దీగా ఉంటుంది. అయితే సోమవారం దానికి సెలవు కావడంతో ఆ ప్రాంతంలో జన సాంద్రత కాస్త తక్కువగా ఉంది. లేదంటే మృతుల సంఖ్య భారీగా నమోదయ్యేది. మార్కెట్‌ను రేపు కూడా మూసేస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజయ్ భార్గవ్ ప్రకటించారు.
News November 10, 2025
ఇన్స్టంట్ లోన్లవైపే ఎక్కువ మంది మొగ్గు

వడ్డీ ఎంతైనా ఫర్వాలేదు… పెద్దగా హామీ పత్రాల పనిలేకుండా ఇచ్చే ఇన్స్టంట్ లోన్లవైపే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. దీపావళి సీజన్లో ‘పైసాబజార్’ చేపట్టిన సర్వేలో 42% మంది ఈ లోన్లపై ఆసక్తిచూపారు. 25% మంది వడ్డీపై ఆలోచించారు. 80% డిజిటల్ ప్లాట్‌ఫాంల నుంచి లోన్లకు ప్రాధాన్యమిచ్చారు. కొత్తగా 41% పర్సనల్ LOANS తీసుకున్నారు. కాగా అనవసర లోన్లు సరికాదని, వాటి వడ్డీలతో కష్టాలే అని EXPERTS సూచిస్తున్నారు.


