News November 3, 2024
టర్నింగ్ పిచ్‌లే మనకు శత్రువులు: హర్భజన్

భారత్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ టీమ్‌ను మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభినందించారు. భారత జట్టుకు టర్నింగ్ పిచ్‌లే శత్రువులుగా మారుతున్నాయని అన్నారు. ‘టీమ్‌ఇండియా మెరుగైన పిచ్‌లపై ఆడాలని చాలా ఏళ్ల నుంచి చెబుతున్నా. ఈ టర్నింగ్ పిచ్‌లు ప్రతి బ్యాటర్‌ను చాలా సాధారణంగా కనిపించేలా చేస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 4, 2026
ఫైరింగ్ నేర్చుకుని భార్యను కాల్చి చంపిన టెకీ

బెంగళూరులోని బసవేశ్వరలో గతనెల 24న జరిగిన బ్యాంకు మహిళా ఉద్యోగి హత్యకేసులో పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. భార్య భువనేశ్వరిని చంపమని భర్త బాలమురుగన్ మొదట TNకు చెందిన వ్యక్తికి రూ.1.25లక్షలు సుపారీ ఇచ్చాడు. అతను చంపలేదని స్వయంగా తానే చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. బిహార్ వెళ్లి రూ.50 వేలకు గన్ కొన్నాడు. అక్కడే 15 రోజులు గన్ కాల్చడం నేర్చుకున్నాడు. తిరిగి వచ్చి నడిరోడ్డుపై భార్యను కాల్చి చంపేశాడు.
News January 4, 2026
ఫోర్బ్స్ ’40 అండర్ 40’లో ఏకైక భారతీయుడు

ప్రపంచ వ్యాప్తంగా యువ బిలియనీర్లను గుర్తించే ఫోర్బ్స్ ‘40 అండర్ 40’లో ఈసారి నలుగురు భారత సంతతి వ్యాపారవేత్తలకు చోటు లభించింది. ఇందులో భారత్ నుంచి ఏకైక బిలియనీర్‌గా జెరోధా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ నిలిచారు. 39 ఏళ్ల నిఖిల్ నెట్‌వర్త్ $3.3Bగా ఉంది. ఈ లిస్ట్‌లో AI స్టార్టప్ మెర్కోర్‌ను స్థాపించిన ఆదర్శ్ హిరేమత్, సూర్య మిద్దా కూడా ఉన్నారు. ఈ జాబితాలో వీళ్లే అతి చిన్న వయస్కులైన (22 ఏళ్లు) బిలియనీర్లు.
News January 4, 2026
సుదర్శన చక్రం మహిర్షిని ఎందుకు వెంబడించింది?

అంబరీషుడు ఏకాదశి వ్రతం ముగించి ద్వాదశి ఘడియల్లో భోజనం చేయాలి. కానీ అతిథి దుర్వాస మహర్షి స్నానానికి వెళ్లి రావడం ఆలస్యమైంది. వ్రత భంగం కావొద్దని పండితుల సూచనతో అంబరీషుడు కేవలం తీర్థం పుచ్చుకుంటాడు. దీనిని అవమానంగా భావించిన దుర్వాసుడు ఆగ్రహంతో ఓ రాక్షసిని సృష్టించి రాజుపైకి పంపుతాడు. భక్త రక్షణ కోసం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని పంపగా, అది కృత్యను సంహరించి ఆ తర్వాత దుర్వాసుడిని వెంబడిస్తుంది.


