News April 19, 2024
ఓటింగ్ శాతం @11am

★ అరుణాచల్ప్రదేశ్: 20.13%
★ అస్సాం: 27.22%
★ బిహార్: 20.42
★ ఛత్తీస్గఢ్: 28.12
★ మధ్యప్రదేశ్: 30.46
★ మణిపుర్: 29.61
★ రాజస్థాన్: 22.59
★ తమిళనాడు: 23.87
★ పశ్చిమబెంగాల్: 33.56
Similar News
News January 31, 2026
పాడి పశువులకు ‘దశరథ గడ్డి’తో కలిగే లాభాలివే

☛ దశరథ గడ్డిని ఆవులు, గేదెలకు ప్రతిరోజూ 2 కేజీల చొప్పున ఇస్తే పాల దిగుబడి, వెన్నశాతం వృద్ధి చెందుతుంది.
☛ మేకలు, గొర్రెలకు దాణా బదులుగా 50 శాతం ఈ గడ్డిని ఆహారంగా ఇస్తే వాటి పెరుగుదల బాగుంటుంది.
☛ లేయర్ (ఆడ) కోడిపిల్లలకు ఆహారంలో 6 శాతం ఈ గడ్డిని ముక్కలు చేసి వేస్తే గుడ్ల నాణ్యత పెరుగుతుంది.
☛ కుందేళ్లు, పందులకు ఈ గడ్డిని అందిస్తే వాటి పెరుగుదల వేగంగా ఉంటుంది.
News January 31, 2026
ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థకు ముప్పు: ఎకనామిక్ సర్వే

రాష్ట్ర ప్రభుత్వాల ఉచిత పథకాలు ప్రజా ధనాన్ని హరిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు లేకుండా చేస్తున్నాయని ఆర్థిక సర్వే 2025-26 హెచ్చరించింది. నగదు బదిలీ పథకాల వల్ల రాష్ట్రాల ఖర్చు భారీగా పెరిగినట్లు తెలిపింది. ఫలితంగా రోడ్లు, ఆసుపత్రులు వంటి మౌలిక సదుపాయాలకు నిధులు తగ్గినట్లు పేర్కొంది. ఈ పరిస్థితి మారాలంటే బ్రెజిల్లోని ‘బోల్సా ఫామిలియా’ వంటి ఫలితాల ఆధారిత నమూనాలను అనుసరించాలని సూచించింది.
News January 31, 2026
లడ్డూ నెయ్యి కల్తీ కనిపెట్టడంలో ప్రభుత్వ శాఖలూ వైఫల్యం

AP: శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీని కనిపెట్టడంలో ప్రభుత్వంలోని వివిధ శాఖల సిబ్బంది నిర్లక్ష్యం వహించారని CBI ఆధ్వర్యంలోని SIT ఆక్షేపించింది. రాష్ట్ర బాయిలర్, GST, జిల్లా ఇండస్ట్రీస్ విభాగాల సిబ్బంది విధులు సరిగా నిర్వహించలేదని పేర్కొంది. డెయిరీల బాయిలర్లను, నెయ్యి ట్యాంకర్లు వచ్చే రూట్ల చెక్ పోస్టులలో GST సిబ్బంది తనిఖీలు చేయలేదని నివేదించింది. వారిపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖలకు లేఖలు రాసింది.


