News October 18, 2024

టీవీ యాంకర్ టు మిస్ ఇండియా

image

ఫెమినా మిస్ ఇండియాగా నికిత పోర్వాల్ నిలిచారు. 24 ఏళ్ల నికిత MPలోని ఉజ్జయినిలో జన్మించారు. బరోడాలో పీజీ చదువుతున్నారు. కుటుంబానికి అండగా నిలిచేందుకు 18 ఏళ్లకే టీవీ యాంకర్‌గా పనిచేశారు. ఆమెకు భక్తి ఎక్కువ, జంతువులంటే అమితమైన ప్రేమ. ‘కృష్ణలీల’ అనే నాటకాన్ని స్వయంగా రాశారు. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ మూవీలో నటించాలనుందని నికిత తెలిపారు. త్వరలోనే ఆమెను సిల్వర్ స్క్రీన్‌పై చూసే అవకాశముంది.

Similar News

News October 18, 2024

కెనడాలో బలమైన భారతీయ సమాజం

image

కెనడాలో 28 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 18 లక్షల భారత సంతతివారు, 10 లక్షల మంది ప్రవాసులు ఉన్నారు. వాంకోవర్, టొరంటో, మాంట్రియల్, విన్నీ పెగ్, ఒట్టావా ప్రాంతాల్లో అధికంగా జీవిస్తున్నారు. అక్కడ చదివే విదేశీ విద్యార్థుల్లో 45 శాతం మంది భారతీయులే. అక్కడి పథకాల్లో ప్రధాన లబ్ధిదారులూ మనవాళ్లే. 2019లో కెనడా వెళ్లిన భారతీయుల సంఖ్య 2.46 లక్షలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 28 లక్షలకు చేరుకుంది.

News October 18, 2024

శ్వేతపత్రాలపై ఏం చేశారు? నివేదికివ్వండి: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ సీఎం చంద్రబాబు 2 నెలల కిందట పలు రంగాలపై శ్వేత పత్రాలు విడుదల చేశారు. అయితే ఆయా శాఖలు వాటిపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాయో ప్రభుత్వానికి నివేదించలేదు. దీనిపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. శ్వేతపత్రాలపై తీసుకున్న చర్యలు, జరుగుతున్న విచారణలు వంటి అంశాలపై సమగ్ర నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.

News October 18, 2024

హరీశ్ రావు బంధువులపై చీటింగ్ కేసు నమోదు

image

TG: మాజీ మంత్రి హరీశ్‌రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, ఫాస్మో కంపెనీపై మియాపూర్‌లో ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదైంది. తనకు తెలియకుండా ఇంటిని అమ్మేశారని, అక్రమంగా వచ్చి ఉంటున్నారని దండు లచ్చిరాజు అనే వ్యక్తి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జంపన ప్రభావతి, తన్నీరు గౌతమ్, తన్నీరు పద్మజారావు, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్, గారపాటి నాగరవిపై కేసు నమోదైంది.