News October 10, 2025
పొత్తుపై EPS వ్యాఖ్యలు.. ఖండించిన TVK

విజయ్ పార్టీ TVKతో పొత్తుపై AIADMK నేత E.పళనిస్వామి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. TNలో ఎన్డీయే కూటమి కోసం ఇప్పటికే పని ప్రారంభమైందని చెప్పారు. నమక్కల్ జిల్లాలో తన ప్రచారంలో కొందరు TVK జెండాలను ఊపడంపై ఆయన స్పందిస్తూ ‘చర్యలు మొదలయ్యాయి. ఇది విప్లవ ధ్వని. ఈ శబ్దాన్ని మీరు (DMK) తట్టుకోలేరు’ అని అన్నారు. పొత్తులు తప్పనిసరని, తమ కూటమి మరింత బలపడుతుందని చెప్పారు. అయితే పళని వ్యాఖ్యలను టీవీకే ఖండించింది.
Similar News
News October 10, 2025
డిసెంబర్‌లో ఐపీఎల్-2026 వేలం!

ఐపీఎల్-2026 వేలం డిసెంబర్ 13-15 తేదీల్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐతో ఫ్రాంచైజీలు చర్చిస్తున్నట్లు Cricbuzz వెల్లడించింది. ప్లేయర్ల రిటెన్షన్‌కు నవంబర్ 15 వరకు డెడ్‌లైన్ ఉండొచ్చని సమాచారం. గత రెండు సీజన్లలో విదేశాల్లో వేలం జరగ్గా, ఈ సారి భారత్‌లో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటన్నింటిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
News October 10, 2025
ఈఫిల్ టవర్‌ను కూల్చనున్నారా?.. నిజమిదే!

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను కూల్చేయనున్నట్లు SMలో ఓ వార్త వైరలవుతోంది. 1889లో నిర్మించిన ఈ టవర్ బలహీనపడిందని, నిర్వహణ ఖర్చులు ఎక్కువవడం వల్లే తొలగిస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. సమ్మె కారణంగా టవర్ సందర్శన నిలిపివేశారు. కాగా కూల్చేందుకే అంటూ కొందరు పోస్టులు చేశారు. చాలామంది దీనిపై పోస్టులు చేయడంతో నిర్వహణ సంస్థ ఈ వార్తలను ఖండించింది. టవర్ కూల్చట్లేదని స్పష్టం చేసింది.
News October 10, 2025
నోబెల్ పీస్ ప్రైజ్: ట్రంప్‌కు మద్దతిచ్చిన రష్యా

కాసేపట్లో నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అవార్డుకు పోటీ పడుతున్న ట్రంప్‌కు మద్దతిస్తున్నట్లు రష్యా ప్రతినిధి యూరీ ప్రకటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపేందుకు ట్రంప్ చేస్తున్న కృషిని ఇటీవల రష్యా స్వాగతించిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలు మద్దతిస్తున్నప్పటికీ ట్రంప్‌కు అవార్డు రావడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.