News July 1, 2024

ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు అసాధ్యం: CBSE

image

ప్రస్తుత అకడమిక్ షెడ్యూల్ ప్రకారం 10, 12వ తరగతి విద్యార్థులకు ఏడాదికి 2సార్లు బోర్డు ఎగ్జామ్స్ అసాధ్యమని CBSE తెలిపింది. ఏడాదికి 2సార్లు పరీక్షలు పెట్టి, ఉత్తమ మార్కులనే పరిగణనలోకి తీసుకోవాలని జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా విద్యాశాఖ AUGలో సిఫార్సు చేసింది. ఈ మేరకు CBSE ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. దీంతో పాఠశాలల ప్రిన్సిపల్స్‌తో చర్చించిన CBSE ప్రస్తుతం ఈ విధానం అసాధ్యమని తెలిపింది.

Similar News

News July 3, 2024

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్!

image

TG: నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి వర్గ విస్తరణపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పీసీసీ చీఫ్ నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రేపు లేదా ఎల్లుండి కొత్త మంత్రుల ప్రకటనతో పాటు శాఖల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశముంది.

News July 3, 2024

రైతు భరోసా ఎన్ని ఎకరాలకివ్వాలి?

image

TG: రైతు భరోసా(రైతుబంధు) ఎన్ని ఎకరాల వారికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఇప్పటికే ఆదర్శ రైతుల అభిప్రాయం సేకరించిన అధికారులు.. మరింత మంది సలహాలు స్వీకరించనున్నారు. ప్రతి సహకార సంఘంలోని రైతుల ఆలోచనలు తీసుకోనున్నారు. 5 ఎకరాలు, 8, 10, 15, 20, 30 ఎకరాల్లోపు ఎవరికి ఇవ్వాలనే దాన్ని ప్రతిపాదించి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.

News July 3, 2024

ఇవాళ హాల్‌టికెట్లు విడుదల

image

TG: ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పీజీ ఎంట్రన్స్ టెస్ట్ హాల్‌టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. 8 వర్సిటీల్లోని 45 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలకు 73,566 మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 15 వరకు పరీక్షలు జరగనున్నాయి. అటు ఇతర పరీక్షల కారణంగా ఈ నెల 7న జరగాల్సిన ఎంఈడీ పరీక్షను 16వ తేదీకి వాయిదా వేశారు. cpget.tsche.ac.in వెబ్‌సైటు నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు.