News December 15, 2024
ఎస్సై ఆత్మహత్య కేసులో ట్విస్ట్

TG: ములుగు(D) వాజేడు SI హరీశ్ <<14767070>>ఆత్మహత్య<<>> కేసులో అనసూర్య అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేటకు చెందిన ఆమె రాంగ్ కాల్ ద్వారా ఆయనకు పరిచయమైంది. తరచూ ఫోన్ చేస్తూ సాన్నిహిత్యం పెంచుకొని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. హరీశ్ అందుకు నిరాకరించారు. తనను శారీరకంగా వాడుకున్నాడంటూ మీడియాకు, ఉన్నతాధికారులకు చెబుతానని ఆమె బెదిరించడంతోనే హరీశ్ రివాల్వర్‌తో కాల్చుకొని చనిపోయాడని పోలీసులు తెలిపారు.
Similar News
News January 22, 2026
గవర్నర్లు VS రాష్ట్ర ప్రభుత్వాలు

బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్లు VS రాష్ట్ర ప్రభుత్వాలుగా పరిస్థితి మారింది. TNలో RN రవి, కర్ణాటకలో థావర్ చంద్ అక్కడి ప్రభుత్వాలు రూపొందించిన ప్రసంగ పాఠాలను చదవడానికి నిరాకరిస్తూ సభనుంచి వెళ్లిపోయారు. అటు తామిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ రాజేంద్ర మార్చారని కేరళ CM విజయన్ ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న STATESలో ఇవి దుమారాన్ని రేపుతున్నాయి. కాగా గవర్నర్ తీరుపై SCకి వెళ్లాలని కర్ణాటక నిర్ణయించింది.
News January 22, 2026
నవజాత శిశువుల్లో ఈ లక్షణాలున్నాయా?

శిశువు చేతులు, కాళ్లు చల్లగా ఉండటం, చర్మం పాలిపోయినట్టు లేదా కొద్దిగా నీలం రంగులో కనిపించడం వంటివి పసిపిల్లల్లో జలుబు లక్షణాలు. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉన్నా, ఏడుస్తున్నప్పుడు వేగంగా శ్వాస తీసుకోవడం, తరచుగా తుమ్మడం, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. సమయానికి చికిత్స చేయకపోతే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
News January 22, 2026
ఏడాదిలో 5సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు

పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ రూల్స్‌ను కఠినం చేసింది. ఏడాదిలో 5సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే డ్రైవర్ల లైసెన్సును రద్దు లేదా 3 నెలల పాటు సస్పెండ్ చేయనుంది. గతంలో సీరియస్ ఉల్లంఘనల్లో ఇది ఉండేది. కానీ ఇపుడు హెల్మెట్, సీట్ బెల్ట్, రెడ్ లైట్ జంపింగ్ వంటి అంశాలకూ వర్తించనుంది. JAN 1 నుంచే అమల్లోకి తెస్తూ కేంద్రం చట్టాన్ని సవరించింది.


