News June 4, 2024

మెదక్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్

image

మెదక్‌ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రతి రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం చేతులు మారుతోంది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆధిక్యంలోకి వచ్చారు. అంతకుముందు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. తొలి రెండు రౌండ్లు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఆధిక్యంలోకి వచ్చి వెనుకంజ వేశారు.

Similar News

News November 17, 2025

సౌదీ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి

image

సౌదీలో జరిగిన ఘోరప్రమాదంలో 45 మంది HYD వాసులు మరణించడంపై AP CM CBN దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్ర యాత్రలో ఇలా జరగడం బాధాకరమన్నారు. ప్రమాదంపై BRS అధినేత KCR దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు సాయంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఏపీ మాజీ CM YS జగన్ విచారం వ్యక్తంచేస్తూ గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

News November 17, 2025

షేక్ హసీనాను దోషిగా తేల్చిన కోర్టు

image

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాను ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్(ICT) దోషిగా తేల్చింది. గతేడాది విద్యార్థుల ఆందోళనలను హింసాత్మకంగా అణచివేశారని, 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని విచారించిన ICT ఆధారాలను నిజమైనవిగా పరిగణించి దోషిగా తేల్చింది. ఆమెకు గరిష్ఠశిక్ష పడుతుందని పేర్కొంది. ఇవి తప్పుడు ఆరోపణలని, తీర్పును పట్టించుకోనని హసీనా అన్నారు.