News March 22, 2025
ట్విటర్ ‘పిట్ట’కు భలే ధర

ట్విటర్ పేరు వినగానే ‘పిట్ట’ లోగోనే గుర్తుకొస్తుంది. ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్న తర్వాత దాని పేరు, లోగోను Xగా మార్చారు. తర్వాత శాన్ఫ్రాన్సిస్కోలోని హెడ్ క్వార్టర్ బిల్డింగ్‌కు 12F పొడవు, 9F వెడల్పు, 254KGల బరువుతో ఉన్న పిట్ట లోగోను తొలగించారు. తాజాగా దాన్ని వేలం వేయగా 34,375 డాలర్లు(రూ.30 లక్షలు) పలికింది. 2006లో దీన్ని 15 డాలర్లతో తయారుచేయించినట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి.
Similar News
News March 23, 2025
క్షమాపణల కంటే మరణాన్నే కోరుకున్న భగత్!

ఇంకెప్పుడూ హింసకు పాల్పడనని రాసిచ్చి క్షమాపణలు చెబితే వదిలేస్తామని బ్రిటిషర్లు భగత్‌సింగ్‌కు ఆఫర్ ఇచ్చారు. ‘వారికి క్షమాపణలు చెప్పడం కంటే చావే నాకు ఇష్టం’ అంటూ ఉరికంబాన్నే కోరుకున్నారాయన. ‘యంగ్ ఇండియా’ పుస్తకంలో గాంధీ భగత్ గురించి ప్రస్తావించారు. ‘భగత్ అసలు బతకాలని భావించలేదు. కనీసం అప్పీల్ కూడా చేయలేదు. <<15857764>>ఆ ముగ్గురూ<<>> మరణభయాన్ని జయించారు. ఆ ధీరత్వానికి మనం 1000సార్లు ప్రణమిల్లాలి’ అని రాసుకొచ్చారు.
News March 23, 2025
బ్లాక్‌లో SRH Vs RR మ్యాచ్ టికెట్లు.. 11మంది అరెస్ట్

ఇవాళ మధ్యాహ్నం జరగనున్న సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహేశ్వరంలో నలుగురు, మల్కాజిగిరిలో ముగ్గురు, ఎల్బీనగర్లో ముగ్గురు, భువనగిరిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
News March 23, 2025
బెట్టింగ్ యాప్.. ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్‌పై ఫిర్యాదు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేస్తున్నారంటూ టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్‌లపై హైదరాబాద్ పోలీసులకు రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఓ బెట్టింగ్ యాప్‌కు వీరు ముగ్గురు ప్రమోషన్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చాలా మంది యువకులు డబ్బులు పోగొట్టుకున్నారని ఆరోపించారు. కాగా ఇటీవల దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండపై కూడా ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే.