News August 6, 2024
లైక్స్, కామెంట్స్, రీపోస్ట్స్ కౌంట్‌ను తొలగించనున్న ట్విటర్?

ట్విటర్లో పోస్టులకు వచ్చే రిప్లైల్లో లైక్స్, కామెంట్స్, రీపోస్ట్స్ కౌంట్‌ను చూపించడాన్ని నిలిపేయాలని సంస్థ భావిస్తోందట. ట్విటర్ గురించి అప్డేట్స్ ఇచ్చే ఎక్స్ డెయిలీ న్యూస్ ఈ విషయాన్ని తెలిపింది. తద్వారా వినియోగదారులకు పేజీలు మరింత నీట్‌గా, గందరగోళం లేకుండా కనిపిస్తాయని సంస్థ భావిస్తోందని పేర్కొంది. మున్ముందు న్యూస్ఫీడ్కూ దీన్ని వర్తింపచేయాలనుకుంటోందని తెలిపింది.
Similar News
News December 12, 2025
వారణాసిలో 5 గెటప్‌లలో మహేశ్ బాబు!

రాజమౌళి-మహేశ్ కాంబోలో రూపొందుతున్న ‘వారణాసి’ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వైరలవుతోంది. మహేశ్ 5 పాత్రల్లో కన్పిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. విజువల్ వండర్‌గా, సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ అవతారాలలో హీరోను తెరపై చూపించనున్నారని టాక్ నడుస్తోంది. ‘రుద్ర’, రాముడిగా కనిపిస్తారని ఇప్పటికే రాజమౌళి 2 గెటప్‌లను రివీల్ చేయగా, మిగతా 3 ఏమై ఉంటాయని చర్చ జరుగుతోంది. ఈ ప్రచారం నిజమైతే మహేశ్ ఫ్యాన్స్‌కు పండగే.
News December 12, 2025
మరణించినట్లు కలలు వస్తే.. అది దేనికి సంకేతం?

ఓ వ్యక్తికి తాను చనిపోయినట్లు పదేపదే కలలు వస్తుంటే భయపడాల్సిన అవసరం లేదని స్వప్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది మంచి ఫలితాన్నే సూచిస్తుందని అంటున్నారు. ‘ఏదైనా సంక్షోభం లేదా మరణ ముప్పు ఇప్పటికే దాటిపోయిందని, దాని నుంచి మీరు తప్పించుకున్నారని ఈ కలలు సూచిస్తాయి. అయితే ప్రమాదానికి గురైనట్లు కలలు వస్తే దాన్ని హెచ్చరికలా భావించి జాగ్రత్తగా ఉండాలి’ అని సూచిస్తున్నారు.
News December 12, 2025
వరి నాట్లు వేసేటప్పుడు జాగ్రత్తలు(2/2)

వరి నారును పొలంలో నాటేముందు కొనలు తుంచి నాటాలి. దీని వల్ల నారు కొనలలో కాండం తొలుచు పురుగు, ఇతర పురుగులు పెట్టిన గుడ్లను నాశనం చేయవచ్చు. నాట్లు పైపైనే 3సెంటీమీటర్ల లోతులోనే నాటాలి. దీనివల్ల మొక్కల్లో పిలకలు ఎక్కువగా వస్తాయి. నాటేటప్పుడు పొలంలో ప్రతి 2 మీటర్ల దూరానికి 20 సెం.మీ కాలిబాటలు వదలాలి. కాలిబాటలు తూర్పు పడమర దిశగా ఉంచాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు బాగా అంది చీడల సమస్య తగ్గుతుంది.


