News November 27, 2024

శైలజ కుటుంబానికి రెండెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు

image

TG: ఫుడ్ పాయిజన్‌తో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన <<14706403>>విద్యార్థిని శైలజ<<>> కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.1.20 లక్షల సాయం అందజేసింది. దీంతో పాటు రెండెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని ఎమ్మెల్సీ విఠల్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ హామీతో గ్రామస్థులు నిన్న శైలజ అంత్యక్రియలు పూర్తి చేశారు.

Similar News

News November 27, 2024

ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ

image

డైరెక్టర్ సుధీర్ వర్మ, హీరో నిఖిల్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే నవంబర్ 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అభిమానులను మెప్పించలేకపోయింది. కాగా ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ ఫేం రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు.

News November 27, 2024

వివాదంలో బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక

image

బిగ్‌బాస్ ఫేమ్, సీరియల్ నటి ప్రియాంక సరదా కోసం చేసిన పని వివాదానికి దారి తీసింది. తిరుమల నడక మార్గంలో స్నేహితుడితో కలిసి వెళ్తూ తమపై చిరుత అటాక్ చేసిందని పేర్కొంటూ ఇటీవల ఓ ఫ్రాంక్ వీడియో చేశారు. దీనిపై టీటీడీ బోర్డు సభ్యులు సీరియస్ అయ్యారు. వారిద్దరిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. భక్తులను కలవరానికి గురిచేసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తడంతో ఆ వీడియోను తొలగించారు.

News November 27, 2024

ఆర్టీసీ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

image

TG: మాజీ సైనికులను ఆర్టీసీ డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు 1,201 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.