News July 28, 2024
USలో రెండున్నర లక్షలమందికి డిపోర్టేషన్ ముప్పు
తల్లిదండ్రులతో US వెళ్లి, అక్కడే పెరిగి పెద్దై ఇంకా గ్రీన్ కార్డు రానివారికి పెద్ద చిక్కొచ్చి పడింది. పేరెంట్స్‌తో వెళ్లి డిపెండెంట్ వీసా మీద ఉన్న పిల్లలకు 21 ఏళ్లు నిండిన వారికి అది రద్దవుతుంది. అలాంటి వారంతా దేశాన్ని వీడాలని యూఎస్ తేల్చిచెబుతోంది. బాధితుల్లో అత్యధికులు భారతీయులే ఉన్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్న దేశాన్ని వదిలి వేరే దేశానికి ఎలా వెళ్లాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 31, 2025
రంజీ ప్రదర్శన రోహిత్‌ను ప్రభావితం చేయదు: దినేశ్ కార్తీక్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ BGTలో ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. తాజాగా రంజీ మ్యాచ్‌లోనూ 3, 28 పరుగులతో నిరాశ పరిచారు. అయితే, త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ప్రదర్శన ఆయన్ను ప్రభావితం చేయదని భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ మళ్లీ లయలోకి వచ్చేందుకు సాధన చేస్తున్నారు. BGTలో ఆల్రెడీ ఇబ్బంది పడ్డారు. అందువల్ల రంజీ వైఫల్యం ఇంపాక్ట్ ఉండదనే అనుకుంటున్నా’ అని స్పష్టం చేశారు.
News January 31, 2025
Stock Market: బడ్జెట్‌కి ముందు బుల్ రంకెలు
బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు గంపెడాశలతో ఉన్నట్టు కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా లాభాల్లో పయనించాయి. బడ్జెట్లో మధ్య తరగతి, ట్యాక్స్ పేయర్స్కి ఊరట కలిగించే అంశాలు ఉంటాయన్న ఊహాగానాల నేపథ్యంలో సూచీలు పరుగులు పెట్టాయి. Sensex 740 PTS లాభంతో 77,500 వద్ద, Nifty 259 PTS ఎగసి 23,508 వద్ద స్థిరపడ్డాయి. FMCG, రియల్టీ, IT, బ్యాంకు, ఫార్మా, మెటల్, ఆటో, ఫైనాన్స్ రంగాలు రాణించాయి.
News January 31, 2025
సచిన్‌కు బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించనుంది. ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో రేపు జరిగే వార్షిక కార్యక్రమంలో సచిన్‌కు ఆ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. భారత్ తరఫున ఆయన 664 మ్యాచులాడారు. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టెస్టు, వన్డే పరుగులు చేశారు. మాజీ ఆటగాళ్లు రవి శాస్త్రి, ఫరూఖ్ ఇంజినీర్‌కు 2023లో ఈ పురస్కారం లభించింది.