News December 25, 2024
స్పేస్‌లో రూపాయి ఖర్చుకు రెండున్నర రెట్ల ఆదాయం: సోమ్‌నాథ్
2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటే ఇస్రో లక్ష్యమని ఇస్రో లక్ష్యమని ఛైర్మన్ సోమ్‌నాథ్ వెల్లడించారు. ఇందుకోసం 2028లో తొలి మాడ్యూల్‌ని నింగిలోకి పంపిస్తామన్నారు. చంద్రుడిపైకి 2040కి వ్యోమగాములను పంపే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. అంతరిక్ష పరిశోధనల కోసం కేంద్రం రూ.31వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. స్పేస్ రంగంపై చేస్తున్న ప్రతి రూపాయి ఖర్చుకు రూ.2.52 ఆదాయం వస్తోందని వెల్లడించారు.
Similar News
News December 25, 2024
ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్న సీఎం
TG: మెదక్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత మెదక్ చర్చిలో జరిగే కార్యక్రమానికి సీఎం వెళ్లనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం వెంట పలువురు మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు.
News December 25, 2024
సంక్రాంతి సెలవుల్లో మార్పులు!
APలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం పండుగ హాలిడేస్ JAN 10-19 తేదీల్లో ఉంటాయని విద్యాశాఖ గతంలో పేర్కొంది. కానీ ఇటీవల భారీ వర్షాలతో చాలా జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవులు ఇచ్చారు. దీంతో పనిదినాలు తగ్గొద్దంటే ఈ సెలవులు తగ్గించాలి. ఈసారి 11-15 లేదా 12-16 తేదీల్లో పొంగల్ హాలిడేస్ ఉండొచ్చని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
News December 25, 2024
యూనస్‌కు US ఫోన్.. ఎందుకంటే?
మతంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్‌కు అమెరికా సూచించింది. ఈ మేరకు మహ్మద్ యూనస్‌తో US NSA జేక్ సలివాన్ ఫోన్లో మాట్లాడారు. ‘మానవ హక్కుల పరిరక్షణ, గౌరవానికి అంకితమయ్యేందుకు ఇద్దరు నేతలు ఆసక్తి ప్రదర్శించారు. సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని నడిపిస్తున్నందుకు యూనస్‌ను జేక్ అభినందించారు. నిలకడ, సౌభాగ్య, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌కు మద్దతిస్తామన్నారు’ అని వైట్‌హౌస్ తెలిపింది.