News October 7, 2024

కరాచీ ఉగ్రదాడిలో ఇద్దరు చైనీయులు మృతి

image

పాకిస్థాన్ కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన <<14292979>>ఉగ్రదాడిలో<<>> ఇద్దరు చైనీయులు మరణించారు. ఈమేరకు పాక్‌లోని చైనా ఎంబసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు తొలుత దీన్ని ఆత్మాహుతి దాడిగా భావించినా, వాహనంలో పేలుడు పదార్థాలు పెట్టి పేల్చినట్లు తర్వాత అధికారులు గుర్తించారు. కాగా విదేశీయులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇప్పటికే బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకున్న విషయం తెలిసిందే.

Similar News

News November 26, 2025

‘భద్రాద్రి జిల్లాలో ఫూలే భవన్ ఏర్పాటు చేయాలి’

image

భద్రాద్రి జిల్లాలో ఫూలే భవన్ ఏర్పాటు అవసరంపై బీఎస్పీ నాయకుడు కురిమెళ్ల శంకర్ స్పందించారు. భజన మందిర్ వెనుక ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి దాదాపు రూ.40 లక్షలు ఖర్చు చేసినప్పటికీ, అది ఇప్పటి వరకు ప్రజల ఉపయోగంలోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ హాలును కొద్ది మరమ్మతులతో పునరుద్ధరించి ఫూలే భవన్‌గా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌ను ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు.

News November 26, 2025

కరీంనగర్: రచ్చబండ కాడ ఎలక్షన్ వేడి

image

‘ఏమే పెద్దయ్య, మళ్ళా సర్పంచ్ ఎలక్షన్లు రానే అచ్చినయ్, ఈపారి ఎవల్ని గెలిపిద్దామె’ అనే ముచ్చట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రచ్చబండల వద్ద హాట్ టాపిక్‌గా మారాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు ఇంటింటా పొర్లు దండాలు పెడుతూ నానా పాట్లు పడుతున్నారు. మీ గ్రామంలో ఏ రిజర్వేషన్ వచ్చింది. ప్రచారం మొదలైందా కామెంట్ చేయండి.

News November 26, 2025

కరీంనగర్ జిల్లాలో మొత్తం 2946 పోలింగ్ కేంద్రాలు

image

కరీంనగర్ జిల్లా: జిల్లాలోని మొత్తం 316 గ్రామ పంచాయతీలు, 2,946 వార్డులకు గాను 2,946 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొదటి విడత: 92 పంచాయతీలు, 866 వార్డులకు 866 పోలింగ్ కేంద్రాలు.
రెండవ విడత: 113 పంచాయతీలు, 1,046 వార్డులకు 1,046 పోలింగ్ కేంద్రాలు.
మూడవ విడత: 111 పంచాయతీలు, 1,034 వార్డులకు 1,034 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి.