News March 19, 2024
ఫోన్ టాపింగ్ కేసులో ఇద్దరు సీఐలు
TS: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు కీలక మలుపు తిరిగింది. ఫోన్ టాపింగ్ కేసులో ఇద్దరు సీఐలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్‌లో పని చేస్తున్న ఆ ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు టాపింగ్ డివైజ్ మొత్తాన్ని ప్రణీత్ ధ్వంసం చేసినట్లు గుర్తించారు. వికారాబాద్ అడవుల్లో పడేసిన హార్డ్ డిస్క్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రణీత్ వెనుక ఓ మీడియా యజమాని ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Similar News
News December 25, 2024
మధుమేహులు ఇలా చేయడం మంచిది: నిపుణులు
డయాబెటిస్‌తో ఇబ్బందిపడేవారు జీవితంలో నడకను భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి 150 నిమిషాల నడక ఉండాలని పేర్కొంటున్నారు. ‘మధుమేహులు రోజుకు అరగంట చొప్పున వారంలో కనీసం 5 రోజులు నడవాలి. డయాబెటిస్‌ను అదుపులోకి తీసుకురావడంలో వాకింగ్ మంచి ఫలితాన్నిస్తుంది. ఒకేసారి అరగంట నడవలేకపోతే 10 నిమిషాల చొప్పున మూడు లేదా నాలుగుసార్లు నడుస్తున్నా ప్రయోజనం ఉంటుంది’ అని వివరిస్తున్నారు.
News December 25, 2024
ఆరుగురిని పెళ్లాడిన కిలేడీ.. చివరకు..!
ఢిల్లీకి చెందిన ఓ యువతి ఆరు పెళ్లిళ్లు చేసుకుని.. ఏడోదానికి సిద్ధమవుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. పూనమ్ పెళ్లి కుమార్తెగా, సంజన ఆమె తల్లిగా నటిస్తూ ఒంటరిగా ఉండే పురుషులను టార్గెట్ చేస్తారు. ఇలా పూనమ్ ఆరుమందిని పెళ్లాడింది. పెళ్లైన వెంటనే ఇంట్లోని బంగారం, నగదుతో ఉడాయిస్తారు. UPకి చెందిన శంకర్ ఉపాధ్యాయ్‌ను కూడా వీరు మోసం చేయాలని చూడగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
News December 25, 2024
ఉచిత బస్సు ప్రయాణంపై మరో కీలక పరిణామం
AP: మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అక్కడ అమలవుతోన్న మహాలక్ష్మీ పథకం గురించి ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం అక్కడ తీసుకున్న నిర్ణయాలు, విధివిధానాల గురించి రేవంత్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు మంత్రులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే.