News April 13, 2025
తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు

TG: ఉపరితల ద్రోణి ప్రభావంతో 2 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల ఓ మోస్తరు వానలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. మంచిర్యాల, జయశంకర్ భూపాల్ పల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News April 14, 2025
దేశంలో పేరు లేని రైల్వే స్టేషన్ మీకు తెలుసా?

బర్ధమాన్ జిల్లా(WB)లోని ఓగ్రామంలో ఉన్న రైల్వే స్టేషన్‌కు ఇప్పటి వరకూ పేరే లేదు. తొలుత రాయ్‌నగర్ అని ఉండేది. అయితే 2008లో ట్రాక్‌ని కొద్ది మేర పెంచడంతో సమీపంలోని రైనా అనే గ్రామంలో స్టేషన్‌ను పునర్నిర్మించారు. దీంతో రైనా పేరుతో రైల్వేస్టేషన్ ఉండాలని గ్రామస్థులు నిరసన చేశారు. రెండు గ్రామాల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో రైల్వేశాఖ ఇప్పటివరకూ స్టేషన్‌కు పేరే పెట్టలేదు.
News April 14, 2025
దిగ్గజ బ్రిటిష్ నటి కన్నుమూత

దిగ్గజ బ్రిటిష్ నటి జీన్ మార్ష్(90) కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా డిమెన్షియాతో బాధపడుతున్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని సన్నిహితులు తెలిపారు. బ్రిటిష్ డ్రామా ‘అప్‌స్టెయిర్స్, డౌన్‌స్టెయిర్స్’కి 1975లో ఆమె ప్రతిష్ఠాత్మక ఎమ్మీ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 2012లో జీన్‌కు ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ గౌరవం దక్కింది.
News April 14, 2025
రక్తమోడిన రోడ్లు.. ఎనిమిది మంది మృతి

AP: కడప(D) ఒంటిమిట్ట(M) నడింపల్లి వద్ద బస్సు-బొలెరో ఢీకొన్న ఘటనలో జీపులోని ముగ్గురు, నెల్లూరు(D) రాపూరులోని తిక్కనవాటిక పార్కు వద్ద కారు ఢీకొట్టడంతో వడ్లు ఎండబెట్టుకుంటున్న ఇద్దరు రైతులు చనిపోయారు. TG జనగామ(D) రాఘవపూర్ వద్ద లారీని కారు ఢీకొట్టడంతో కారు డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు చనిపోయారు. అటు RR(D) దామరగిద్ద వద్ద కారు డోర్లు లాక్ పడటంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు.