News March 31, 2025

రెండు రోజులు ఎండలు.. ఏప్రిల్ 3న వడగండ్లు

image

TG: రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. నిన్న 16 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జనగామ మినహా అన్ని జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో వైపు ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. వచ్చే నెల 3న వడగండ్లు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించారు.

Similar News

News November 22, 2025

బొద్దింకలతో కాఫీ.. టేస్ట్ ఎలా ఉందంటే?

image

ఏదైనా తినే పదార్థంలో బొద్దింక పడితే మనమైతే దానిని చెత్తబుట్టలో పడేస్తాం. కానీ చైనాలోని బీజింగ్‌లో ఓ కీటకాల మ్యూజియంలో ప్రత్యేకంగా ‘బొద్దింక కాఫీ’ని ప్రవేశపెట్టారు. దీని ధర సుమారు 45 యువాన్లు (US$6). రుచి చూసిన కస్టమర్లు ఇది కాల్చిన- పుల్లటి ఫ్లేవర్ వస్తోందని తెలిపారు. కాఫీపై రుబ్బిన బొద్దింకలు, ఎండిన పసుపు మీల్‌వార్మ్‌లను చల్లుతారు. ఈ వింత డ్రింక్ యువతను ఆకర్షిస్తూ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

News November 22, 2025

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 46ను విడుదల చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని జీవోలో స్పష్టం చేసింది. SC, ST, BC, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనుంది. ST రిజర్వేషన్లు ఖరారయ్యాక SC, BC రిజర్వేషన్లు ఉంటాయి. రేపు సా.6 గంటల్లోపు ఖరారు చేసిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖకు కలెక్టర్లు అందించనున్నారు.

News November 22, 2025

ఇంజినీరింగ్ విద్యార్థినులకు JNTU హైదరాబాద్ గొప్ప అవకాశం

image

బీటెక్​ చదివిన ప్రతి విద్యార్థినికి ఉద్యోగం రావాలని JNTU హైదరాబాద్​ అధికారులు కొత్త ఆలోచనను అమల్లోకి తీసుకొచ్చారు. క్యాంపస్​ ఇంటర్వ్యూల్లో కొద్దిపాటి తేడాతో ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన విద్యార్థినులకు ఆరు నెలలు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు సాధించేందుకు సాయం చేయనున్నారు. ఇందుకోసం బెంగళూరులోని ఎమర్టెక్స్​ అనే ఐటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. JNTUలో చదివితే ఉద్యోగం ఖాయం అనే ధీమాను కల్పిస్తున్నారు.