News February 26, 2025
రెండు రోజులు సెలవులు

TG: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు మంజూరు చేసింది. పోలింగ్ ఉండటంతో ఈ నెల 27న, కౌంటింగ్ జరిగే మార్చి 3న సెలవులు వర్తించనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. కాగా ఉమ్మడి మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీతో పాటు నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల్లో టీచర్ MLC ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News January 13, 2026
‘మీ సేవ’ ముసుగులో భూ రిజిస్ట్రేషన్ల నిధుల స్వాహా!

TG: భూ భారతిలో వెలుగు చూసిన రిజిస్ట్రేషన్ల నిధుల స్వాహాపై విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘మీసేవ’లో భూ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకున్నా కొందరు నిర్వాహకులు ప్రజలను మభ్యపెట్టి తతంగాన్ని నడిపించారు. భూ భారతి (గతంలో ధరణి) సైట్లో నేరుగా దరఖాస్తులు అప్లోడ్ చేసి అక్రమాలకు తెగబడ్డారు. ‘మీసేవ’ ప్రభుత్వానిదేనన్న ఉద్దేశంతో ప్రజలూ నమ్మారు. దీంతో నిర్వాహకులు సొమ్ము కాజేసినట్లు అనుమానిస్తున్నారు.
News January 13, 2026
రూ.200 కోట్లు దాటేసిన ‘రాజాసాబ్’

ప్రభాస్-డైరెక్టర్ మారుతి కాంబోలో వచ్చిన రాజాసాబ్ చిత్రం రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. 4 రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ.201 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. మొదట సినిమాపై మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రభాస్ ఓల్డ్ లుక్తో రూఫ్ టాప్ ఫైట్ యాడ్ చేసిన తర్వాత ఆ పరిస్థితి మారిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News January 13, 2026
10 నిమిషాల్లో ఫుడ్ వస్తుంది.. మరి అంబులెన్స్?

TG: శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రధాన రహదారిపై కారు డివైడర్ను ఢీకొట్టడంతో 5నెలల గర్భిణి, ఆమె తల్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడారు. విచారకరమైన విషయమేమిటంటే గంట వరకు అంబులెన్స్ రాలేదు. 10ని.ల్లో ఫుడ్ డెలివరీ అయ్యే నగరంలో గంట దాటినా అంబులెన్స్ రాకపోవడం ఆందోళనకరమని నెటిజన్లు మండిపడుతున్నారు. చివరకు ప్రైవేట్ అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. సమయానికి అంబులెన్స్ వస్తే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి.


