News July 13, 2024
రెండు అల్పపీడనాలు.. భారీ నుంచి అతిభారీ వర్షాలు?

బంగాళాఖాతంలో జులై 15 నుంచి 22 వరకు వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో రాబోయే 10 రోజులు తెలంగాణ, ఏపీతో పాటు ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని పేర్కొన్నారు. మరోవైపు నిన్న ఏపీలోని కృష్ణా, గుంటూరు, అంబేడ్కర్ కోనసీమ, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
Similar News
News October 25, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలో 3రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, WGL, HNK, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి MBNR జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
News October 25, 2025
కార్తిక మాసంలో ఏరోజు పవిత్రమైనది?

కార్తీక మాసంలో ప్రతి దినం భగవత్ చింతనకు శ్రేష్ఠమైనదే. అయితే కార్తీక సోమవారాలు శివుడికి ప్రీతికరమైనవి. ఈ రోజున ఉపవాసం, రుద్రాభిషేకం చేసేవారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికోట, ఉసిరి చెట్టును పూజించడం శుభాలకు మూలం. కార్తీక పౌర్ణమి ఈ మాసానికి శిఖరాయమానం. ఈ రోజున చేసే నదీ స్నానం, దీపారాధన ద్వారా శివకేశవుల అనుగ్రహం లభించి, జన్మజన్మల పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
News October 25, 2025
నా కొడుకు వ్యాఖ్యలను వక్రీకరించారు: సిద్దరామయ్య

తన రాజకీయ జీవితంపై కొడుకు యతీంద్ర చేసిన <<18075196>>వ్యాఖ్యలను<<>> వక్రీకరించారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. కాబోయే సీఎం ఎవరనే విషయమై కాకుండా విలువల గురించి తన కొడుకు మాట్లాడారని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై తాను ఇప్పుడే స్పందించనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఈ విషయమై ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడతానని చెప్పారు.


