News October 24, 2024
వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి.. మంత్రి కీలక ఆదేశాలు

AP: పల్నాడు(D) దాచేపల్లిలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు వ్యక్తుల మృతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. వారి మృతికి నీరు కలుషితం కావడమే కారణమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. స్థానికంగా ఉన్న బోర్లలో నీటిని విజయవాడ ల్యాబ్కు పరీక్షలకు పంపాలని ఆదేశించారు. బోర్లను మూసివేసి వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News December 30, 2025
వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ <<18708686>>వేకువజామున<<>> శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తర్వాత VIP బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు. 5.30AM నుంచి ఈ-డిప్లో టోకెన్లు పొందిన వారిని అనుమతివ్వనున్నారు. సోమవారం రాత్రి వరకు 55వేల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు అంచనా. TG CM రేవంత్ రెడ్డి, పలువురు AP మంత్రులు సహా పెద్ద సంఖ్యలో VIPలు చేరుకున్నారు.
News December 30, 2025
ప్రైవేటు వ్యక్తుల ప్రతినిధిలా చంద్రబాబు: గుడివాడ అమర్నాథ్

AP: ప్రజలు ఎన్నుకున్న సీఎంలా కాకుండా, ప్రైవేటు వ్యక్తుల ప్రతినిధిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు.. ఇలా అన్ని రంగాలను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. పీపీపీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చని చెప్పడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో పరిపాలనను కూడా ప్రైవేటుపరం చేస్తారేమోనని ఎద్దేవా చేశారు.
News December 30, 2025
మైనారిటీలపై మీ రికార్డు చూసుకోండి.. పాక్కు ఇండియా కౌంటర్

ఇండియాలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయంటూ పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను విదేశాంగ శాఖ ఖండించింది. మైనారిటీల విషయంలో పాక్ అధ్వాన రికార్డు అందరికీ తెలుసని ఎద్దేవా చేసింది. ‘వివిధ మతాలకు చెందిన మైనారిటీలను పాక్ దారుణంగా, ప్లాన్ ప్రకారం బాధితులుగా మారుస్తుందనేది నిజం. మా వైపు వేలు చూపించినంత మాత్రాన అదేమీ మారదు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.


