News October 9, 2024
కోడికి ఈత నేర్పిస్తూ ఇద్దరి మృతి.. మరో వ్యక్తి గల్లంతు

AP: ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో పందెం కోడిని ఈత కొట్టిస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. తండ్రి, ఓ కుమారుడి మృతదేహం లభ్యం కాగా మరో కుమారుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 9, 2025
ఎయిర్లైన్స్ లోపాలను వెంటనే సరిదిద్దాలి: రామ్మోహన్

‘ఇండిగో’ కార్యకలాపాల్లో అంతరాయం వల్ల నెలకొన్న పరిస్థితులను విమానయాన శాఖ&DGCA నిరంతరం పర్యవేక్షిస్తోందని కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు. సోమవారం రాత్రి కూడా సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఎయిర్లైన్స్ పనితీరు, అందిస్తున్న సేవలు తెలుసుకునేందుకు ఎయిర్పోర్టులను సందర్శించాలని అధికారులను ఆదేశించామన్నారు. లోపాలుంటే వెంటనే సరిదిద్దాలని చెప్పినట్లు ట్వీట్ చేశారు.
News December 9, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 09, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


