News July 3, 2024
వెంకటేశ్ కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమం రేపు జరగనుంది. వెంకీ మామ, డైరెక్టర్ అనిల్ కలిసి ఇప్పటికే ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News November 1, 2025
షట్డౌన్ ఎఫెక్ట్.. అమెరికాలో $7 బిలియన్లు ఆవిరి

అమెరికా గవర్నమెంట్ <<17882827>>షట్డౌన్ <<>>సంక్షోభం మరింత ముదురుతోంది. అక్టోబర్ 1 నుంచి ఇప్పటిదాకా $7 బిలియన్ల నష్టం వాటిల్లినట్లు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (CBO) తాజాగా అంచనా వేసింది. ఈ ప్రతిష్టంభన ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై అంత ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. షట్డౌన్ ఆరు వారాలు కొనసాగితే $11 బిలియన్లకు, 8 వారాలు కొనసాగితే $14 బిలియన్లకు నష్టాలు పెరుగుతాయని హెచ్చరించింది.
News November 1, 2025
ఫ్రీ Ai.. బ్యాగ్రౌండ్ రీజన్స్ ఏంటంటే..?

మొన్న Grok Aiని మస్క్, నిన్న perplexity Aiని ఎయిర్టెల్, తాజాగా గూగుల్ Gemini Aiని ఫ్రీగా ఇస్తున్నట్లు జియో ప్రకటించాయి. ఎందుకు ఈ ఫ్రీ పోటీ అంటే.. మార్కెట్లో డామినెంట్, డాన్ అయితేనే యాడ్స్ వస్తాయిగా. సో.. మార్కెట్ వాటా పొందడం రీజన్1. R2: యూజర్స్ సెర్చ్ డేటా, బిహేవియర్ అర్థం చేసుకోవడం. R3: ప్రస్తుతం తొలి స్టేజ్లోని Ai బ్రౌజింగ్ యూజర్స్ ఇన్పుట్స్తో స్కిల్స్, సర్వీస్ తదితరాలు ఇంప్రూవ్ చేసుకోవడం.
News November 1, 2025
సూర్యరశ్మి వల్ల ఇన్ని లాభాలా..!

ప్రతిరోజూ 30 నిమిషాల పాటు సూర్యరశ్మి(ఉదయం/సాయంత్రం)లో ఉండటం ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు. ‘సూర్యరశ్మి విటమిన్-Dని అందిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది సెరోటోనిన్ను విడుదల చేసి మానసిక స్థితిని ఉత్తేజపరుస్తుంది. ఉదయం సూర్యకాంతి నిద్ర నాణ్యతను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, దీర్ఘాయువుకు దోహదపడుతుంది’ అని సూచిస్తున్నారు. SHARE IT


