News March 14, 2025
అత్యుత్తమ ప్రాంతాల జాబితాలో రెండు భారత హోటళ్లు

టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన ‘ప్రపంచంలోని అత్యుత్తమ ప్రాంతాలు’ జాబితాలో భారత్ నుంచి జైపూర్ రాఫిల్స్, బాంధవ్‌గఢ్‌లోని ఒబెరాయ్ వింధ్యావిలాస్ వైల్డ్‌లైఫ్ రిసార్ట్స్ చోటు దక్కించుకున్నాయి. ఈ రెండూ అద్భుతమైన ప్రాంతాలని చెప్పిన టైమ్, ముంబైలోని పాపాస్ రెస్టారెంట్‌ను చూడాల్సిన చోటుగా పేర్కొంది. ఈ జాబితాలో మ్యూజియాలు, పార్కులు, పర్యాటక ప్రదేశాలు తదితర ప్రాంతాలను టైమ్ పరిగణించింది.
Similar News
News March 14, 2025
ప్రభుత్వ పోటీ పరీక్షలన్నీ మరాఠీలోనే: ఫడణవీస్

మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(MPSC) పరీక్షలన్నింటినీ మరాఠీలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర CM ఫడణవీస్ ప్రకటించారు. ‘ఇంజినీరింగ్ కోర్సులు సహా అన్ని సాంకేతిక సబ్జెక్టులూ మరాఠీలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. MPSC పరీక్షల మరాఠీ నిర్వహణ విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం’ అని శాసనమండలిలో తెలిపారు. ఇంగ్లిష్ మాట్లాడలేని విద్యార్థుల కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
News March 14, 2025
పర పురుషులతో భార్య సెక్స్‌చాట్‌ను ఏ భర్తా భరించలేడు: హైకోర్టు

భార్య తన సెక్స్ లైఫ్ గురించి పరపురుషులతో చాటింగ్ చేస్తే ఏ భర్తా భరించలేడని MP హైకోర్టు తెలిపింది. ‘పెళ్లయ్యాక దంపతులు మొబైల్లో తమ మిత్రులతో అనేక అంశాలపై చాటింగ్ చేసుకోవచ్చు. ఆ సంభాషణలు గౌరవంగా ఉండాలి. ప్రత్యేకించి అపోజిట్ జెండర్‌తోనైతే జీవిత భాగస్వామి గురించి అస్సలు అభ్యంతరకరంగా ఉండొద్దు’ అని పేర్కొంది. ఆ భార్య సవాల్ చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ కుటుంబ కోర్టు మంజూరు చేసిన విడాకులను ఆమోదించింది.
News March 14, 2025
అయ్యో లక్ష్యసేన్: సెమీస్‌కు చేరకుండానే ఇంటికి..

భారత యంగ్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడుకు తెరపడింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ఆయన నిష్క్రమించారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో తన కన్నా మెరుగైన ర్యాంకర్, చైనా ఆటగాడు లీ షి ఫెంగ్ చేతిలో ఓటమి చవిచూశారు. వరుసగా రెండు గేముల్లో 10-21, 16-21 తేడాతో పరాజయం పాలయ్యారు. ఆటలో అతడు ఏ దశలోనూ లయ అందుకోలేదు. 2022లో లక్ష్య ఇక్కడ ఫైనల్‌కు చేరడం గమనార్హం.