News April 25, 2024
ఇద్దరు ఇంటర్ అమ్మాయిల ఆత్మహత్య

TG: ఇంటర్ ఫెయిల్ అయినందుకు ఇద్దరు అమ్మాయిలు తనువు చాలించారు. మెదక్ జిల్లా శేరిపల్లిలో ఇంటర్ సెకండియర్ బాలిక పంబాల రమ్య ఉత్తీర్ణత సాధించలేదు. మనస్తాపానికి గురైన ఆమె.. గ్రామ శివారులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లాలోనూ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ కావడంతో తేజస్విని అనే విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
**ఫెయిలైతే సప్లిమెంటరీలో పాస్ కావొచ్చు. కానీ జీవితం తిరిగి రాదు.
Similar News
News January 12, 2026
మంత్రులు, అధికారులతో CM CBN కీలక భేటీ

AP: మంత్రులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి, పారదర్శక పాలన, మెరుగైన ప్రజా సేవలపై ఆయన సమీక్షిస్తున్నారు. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలపైనా చర్చించనున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా వర్చువల్గా హాజరుకానున్నారు.
News January 12, 2026
మేడారం వెళ్తున్నారా? రూట్ మ్యాప్ ఇదే

TG: మేడారం జాతరకు ఈసారీ వన్ వే అమలు చేస్తున్నారు. WGL మీదుగా వచ్చే ప్రైవేటు వాహనాలను పస్రా టూ నార్లాపూర్ వైపునకు మళ్లిస్తారు. మహారాష్ట్ర, కరీంనగర్, BHPL నుంచి వచ్చే వాహనాలను కాల్వపల్లి మీదుగా ఊరట్టం పార్కింగ్ స్థలాల వరకు అనుమతిస్తారు. ఛత్తీస్గఢ్, ఖమ్మం వాహనాలను చిన్నబోయినపల్లి-కొండాయి నుంచి అనుమతిస్తారు. రిటర్న్ జర్నీకి ఇవే రూట్లు ఫాలో కావాలి. RTC, VIP వాహనాలకు తాడ్వాయి రూట్ను కేటాయించారు.
News January 12, 2026
పంట అవశేషాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు

పంట అవశేషాలను కాల్చితే నేలలో కార్బన్ శాతం తగ్గిపోతుంది. నేల ఉపరితలం నుంచి 1cm లోపలి వరకు ఉష్ణోగ్రత 8 డిగ్రీలు పెరిగి నేలలో పంటకు మేలు చేసే బాక్టీరియా, ఫంగస్ నాశనమవుతాయి. వీటిని కాల్చేటప్పుడు వెలువడే కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వల్ల వాతావరణం వేడెక్కుతుంది. ఒక టన్ను పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేల ఉపరితలంలో 5.5kgల నత్రజని, 2kgల భాస్వరం, 2.5kgల పొటాష్, 1kg సేంద్రియ కర్బనం నష్టపోతాం.


