News July 7, 2024

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్ల వీరమరణం

image

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఆరుగురు టెర్రరిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి. తొలుత మోదర్‌గామ్‌లో ఉగ్రవాదులు ఉన్నారని తెలుసుకొని జవాన్లు కాల్పులు జరిపారు. ముష్కరులు ఎదురుదాడి చేయడంతో ఓ జవాన్ మరణించారు. అనంతరం చిన్నిగామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో జవాన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.

Similar News

News November 22, 2025

APR 1 నుంచి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్: సీఎం

image

AP: క్యాబినెట్ ఆమోదం తెలిపిన యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని 2026 APR 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని CM చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం NTR వైద్య సేవ ద్వారా ఏ ప్రాంతంలో, ఏ వ్యాధికి ఎంత ఖర్చు చేస్తున్నామో విశ్లేషించాలని సూచించారు. కాగా కొత్త పథకంతో 1.63 కోట్ల కుటుంబాలకు రూ.2.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం, అందులో 1.43 కోట్ల BPL కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షల ఉచిత వైద్యం అందుతుంది.

News November 22, 2025

బాలికలకు సంతూర్ స్కాలర్‌‌షిప్.. రేపే లాస్ట్ డేట్

image

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో అందించే సంతూర్ ఉమెన్ స్కాలర్‌షిప్‌ అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. AP, మహారాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థినులు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. వీరికి 30వేల రూపాయలు అందుతుంది.
వెబ్‌సైట్: <>https://www.santoorscholarships.com/‌<<>>

News November 22, 2025

రైతులకు గుడ్ న్యూస్.. ఫసల్ బీమా యోజనలో మార్పులు!

image

PM ఫసల్ బీమా యోజనలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇకపై జంతువుల దాడి, వరదలు/నీట మునగడం వల్ల పంట నష్టం వాటిల్లితే పరిహారం ఇవ్వనుంది. ఇప్పటిదాకా కరవు, వడగళ్లు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులే స్కీమ్‌లో ఉండేవని, కొత్తగా ఈ రెండింటిని చేర్చామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. రైతుల వినతిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2026-27 ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు.