News July 30, 2024

రైలు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

ఝార్ఖండ్‌లో జరిగిన రైలు <<13736050>>ప్రమాదంలో<<>> ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. 20 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. కాగా పట్టాలు తప్పిన గూడ్స్ రైలును అదే లైనులో వచ్చిన హౌరా-ముంబై ట్రైన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 1, 2025

BUDGET 2025-26: కీలకాంశాలు

image

* ఆదాయ పన్ను మినహాయింపు రూ.12 లక్షలకు పెంపు
* అద్దెలపై వార్షిక TDS పరిధి రూ.6 లక్షలు
* స్టార్టప్స్‌ మొదలైననాటి నుంచి 5 ఏళ్ల పాటు ప్రయోజనాలు
* 36 రకాల కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ రద్దు
* బీమా రంగంలో FDI పరిధి 100శాతానికి పెంపు
* పదేళ్లలో 100 స్థానిక ఎయిర్‌పోర్టుల నిర్మాణం
* వచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్ సీట్లు
* 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపు
* కిసాన్ క్రెడిట్ కార్డు రుణం రూ.5 లక్షలకు పెంపు

News February 1, 2025

అప్పుడు.. ఇప్పుడు!

image

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 నుంచి వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆరు సార్లు రెగ్యులర్ బడ్జెట్‌, ఒక మద్యంతర బడ్జెట్‌ను సమర్పించగా నేడు ఎనిమిదో సారి ప్రసంగించారు. ప్రతిసారి సంప్రదాయ చీరకట్టులో ఎరుపు రంగు వస్త్రంలో ఉంచిన కాపీలు/ట్యాబ్‌తో ఆమె పార్లమెంట్‌కు రావడం విశేషం. ఇన్నేళ్లుగా ఒకే వ్యక్తి ఆర్థిక మంత్రిగా ఉండటంతో ఇండియన్ బడ్జెట్‌ను.. ‘నిర్మలమ్మ బడ్జెట్’ అని ప్రజలు పిలుస్తుంటారు.

News February 1, 2025

అద్దె, పింఛన్లపై టీడీఎస్, టీసీఎస్ పరిమితి పెంపు

image

అద్దెలపై విధించే TDS వార్షిక పరిమితిని రూ.2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మల తెలిపారు. ఇక పింఛన్ల వడ్డీపై TDS, TCS మినహాయింపును ప్రస్తుతమున్న రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. ‘LRSపై ఉన్న TCS పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నాం. విద్యాసంబంధిత రుణాల్లో టీసీఎస్‌ను రూ.10 లక్షల వరకూ తొలగించాలని ప్రతిపాదన తీసుకురానున్నాం’ అని స్పష్టం చేశారు.