News March 22, 2024
రెండు నెలలు పండుగే.. బెట్టింగ్ జోలికి వెళ్లకండి!

బిజీ లైఫ్లో కాస్త ఉపశమనం ఇచ్చేందుకు బిగ్గెస్ట్ క్రికెట్ ఫెస్టివల్ సిద్ధమైంది. రెండు నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 10 టీమ్స్ తలపడే టోర్నీలో రెండు నెలల పాటు 74 మ్యాచ్లు జరగనున్నాయి. మరి ఈసారి IPL ట్రోఫీ గెలిచేదెవరో చూడాలి. క్రికెట్ను చూస్తూ ఎంజాయ్ చేయండి. కానీ, బెట్టింగ్ పెట్టి అప్పులపాలై కుటుంబాన్ని రోడ్డున పడేయకండి.
Similar News
News December 5, 2025
అవినీతి అధికారి గుట్టు రట్టు.. రూ.100కోట్లకు పైగా ఆస్తులు!

తెలంగాణ ACB మరో అవినీతి అధికారిని పట్టుకుంది. రంగారెడ్డి(D) సర్వే సెటిల్మెంట్&భూ రికార్డుల ఆఫీసులో ADగా పనిచేస్తున్న కొంతం శ్రీనివాసులుపై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. అతనికి HYDలో ఒక ఫ్లాట్, MBNRలో 4 ప్లాట్లు, NRPTలో రైస్ మిల్లు, 3 ప్లాట్లు, అనంతపురం, కర్ణాటకలో 22 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు 4 వీలర్ వాహనాలు, 1.6kgs బంగారం, 770gms వెండి ఉన్నట్లు గుర్తించింది. వీటి వాల్యూ ₹100Cr+ ఉంటుందని అంచనా.
News December 5, 2025
జుట్టు చివర్లు చిట్లుతున్నాయా..?

వాతావరణ మార్పుల వల్ల వెంట్రుకల చివర్లు చిట్లడం ఎక్కువైపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు తలస్నానం చెయ్యాలి. తలస్నానానికి మైల్డ్ షాంపూలు వాడటం మంచిది. బయటకి వెళ్తున్నప్పుడు జుట్టంతా కప్పిఉంచుకోవాలి. తలస్నానం తర్వాత హెయిర్ సీరం వాడటం మంచిది. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడికేటెడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకూడదు. అయినా సమస్య తగ్గకపోతే ఒకసారి ట్రైకాలజిస్ట్లను సంప్రదించాలి.
News December 5, 2025
గూగుల్ డేటా సెంటర్కు 480 ఎకరాలు

AP: విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్కు 480 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విశాఖ(D)లోని తర్లువాడ, అడవివరం, అనకాపల్లి(D)లోని రాంబిల్లిలో భూమిని ఇచ్చేందుకు అంగీకరించింది. గూగుల్ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న అదానీ ఇన్ఫ్రా పేరున కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దశల వారీగా వెయ్యి మెగా వాట్ల ఏఐ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది.


