News September 2, 2024
మరో రెండు జిల్లాల్లో రేపు సెలవు ప్రకటన
AP: భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని మరో రెండు జిల్లాల్లోని స్కూళ్లకు రేపు సెలవు ప్రకటించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు మంగళవారం సెలవు ఇస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటికే గుంటూరు జిల్లాలో <<14002872>>సెలవు<<>> ఇచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News February 2, 2025
MHBD: అంగన్వాడీ ఆయాలకు శుభవార్త
టెన్త్ పాస్ అయినా ఆయాలకు అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు మహబూబాబాద్ కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు గణపురపు అంజయ్య అన్నారు. 2022 ఆగస్టు 1కి ముందు ఆయాలుగా నియమితులైన వారికి ప్రమోషన్ కల్పించాలని CM రేవంత్ రెడ్డి తాజాగా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఆయాలు ఆందోళనలు చేసినా కేసీఆర్ పట్టించుకోలేదని ఆయన అన్నారు.
News February 2, 2025
U19 T20 WC ఫైనల్: టీమ్ ఇండియా బౌలింగ్
ICC ఉమెన్స్ U19 T20 WC ఫైనల్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: కమలిని, G త్రిష, సానికా చల్కే, నికి ప్రసాద్(C), ఈశ్వరి, మిథిల, ఆయుషి శుక్లా, జోషిత, షబ్నాం, పరుణికా, వైష్ణవి.
SA: జెమ్మా బోథా, లౌరెన్స్, డయారా, ఫే కౌలింగ్, కైలా(C), కరాబో మెసో, మైకే వాన్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా, నిని.
LIVE: హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్
News February 2, 2025
బాత్రూమ్‌లో బిడ్డను కని చెత్తకుండీలో విసిరేసిన విద్యార్థిని
తమిళనాడులో అమానుష ఘటన జరిగింది. తంజావూర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీ బాత్రూమ్‌లో బిడ్డను ప్రసవించింది. యూట్యూబ్ సాయంతో బొడ్డు పేగు కోసి ఆ పసిప్రాణాన్ని చెత్తకుండీలో విసిరేసి క్లాస్ రూంకు తిరిగొచ్చింది. దుస్తులకు రక్తస్రావాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు లెక్చరర్లకు చెప్పడంతో వారు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బిడ్డను తీసుకొచ్చి బతికించారు.