News April 25, 2024
వాట్సాప్‌లో మరో రెండు ఫీచర్లు

వాట్సాప్‌లో వాట్సాప్ డైలర్, గ్రూప్ విజిబిలిటీ అనే రెండు ఫీచర్లు రానున్నాయి. వాట్సాప్ డైలర్ ఫీచర్‌తో ఫోన్ నంబర్లు సేవ్ చేసుకోకుండానే ఆయా నంబర్లకు కాల్స్, మెసేజ్‌లు చేసేందుకు వీలుంటుంది. ఇక గ్రూప్ విజిబిలిటీ ఫీచర్‌లో భాగంగా కమ్యూనిటీల అడ్మిన్స్ తమ గ్రూప్స్‌ను, అందులోని చాట్‌లను హైడ్ చేయవచ్చు. ఇది ఆయా గ్రూప్ మెంబర్ల మధ్య చాట్‌కు సంబంధించి ప్రైవసీ కల్పిస్తుంది.
Similar News
News March 15, 2026
గిల్, మంధానకు ప్రతిష్ఠాత్మక అవార్డులు

2024-2025 ఏడాదికి గానూ క్రికెటర్లు గిల్, మంధానను ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయి. అంతర్జాతీయ మెన్స్ క్రికెట్‌లో గొప్ప గౌరవంగా భావించే పాలీ ఉమ్రిగర్ అవార్డును గిల్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది బెస్ట్ ఇంటర్నేషనల్ మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధానను BCCI ఎంపిక చేసింది. ఈమె ఈ అవార్డు అందుకోవడం ఐదోసారి కావడం విశేషం. ఢిల్లీలో జరిగిన నమన్ అవార్డ్స్-2026 వేడుకలో వీరిద్దరూ ఈ పురస్కారాలు అందుకున్నారు.
News March 15, 2026
కమ్యూనిస్ట్ గడ్డపై కమలం వికసిస్తుందా?

సౌత్ ఇండియాపై కన్నేసిన BJP కమ్యూనిస్ట్ గడ్డ కేరళంపై జెండా ఎగురవేయాలని చూస్తోంది. పినరయి విజయన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, శబరిమల గోల్డ్ చోరీ కేసును అవకాశంగా మలుచుకుంటోంది. అటు కేరళంలో BJPని అడుగుపెట్టనివ్వబోమని విజయన్ అంటున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. <<19389988>>మే 4న<<>> వెలువడే ఫలితాలు కేరళం రాజకీయ భవిష్యత్తును తేల్చనున్నాయి..
News March 15, 2026
పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్

AP: పార్టీ చీఫ్ చంద్రబాబు <<19391495>>ఆదేశాలతో<<>> పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని TDP రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై 48 గంటల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివరణ ఇచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.


