News September 20, 2024

మరో ఇద్దరు నేతలు వైసీపీకి గుడ్‌బై?

image

AP: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. వారు పార్టీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే బాలినేని, ఉదయభాను వంటి నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుతో పాటు పలువురు నేతలు ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే.

Similar News

News November 26, 2025

రాజ్యాంగ విలువలు కాపాడాలి: నల్గొండ అదనపు ఎస్పీ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. అదనపు ఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుని, హక్కులు, న్యాయం, సమానత్వం వంటి రాజ్యాంగ విలువలను కాపాడాలని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని, దాని స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.

News November 26, 2025

బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

image

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్‌ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.

News November 26, 2025

పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

image

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.