News May 4, 2024
తెలంగాణలో కొత్తగా మరో రెండు క్లస్టర్లు

TG: మరింత స్పష్టంగా వాతావరణ సూచనలు ఇచ్చేందుకు IMD రాష్ట్రంలో మరో 2 కొత్త క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ఇన్నాళ్లూ.. ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ మాత్రమే ఉండేవి. ఇప్పుడు అదనంగా 2 క్లస్టర్లు ఏర్పాటయ్యాయి. తూర్పు(10 జిల్లాలు), పశ్చిమం(4), దక్షిణం(5), ఉత్తర(9), మధ్య తెలంగాణ(5)లుగా విభజించింది. ఆగ్రో క్లైమేటిక్ పరిస్థితుల ఆధారంగా ఈ క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Similar News
News March 4, 2026
RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News March 4, 2026
చర్చల ప్రసక్తే లేదు.. సుదీర్ఘ యుద్ధమే: ఇరాన్

చర్చలపై US అధ్యక్షుడు ట్రంప్ చేసిన <<19290770>>వ్యాఖ్యలపై<<>> ఇరాన్ స్పందించింది. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని సుప్రీం నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ అలీ లరిజానీ స్పష్టం చేశారు. సుదీర్ఘ యుద్ధానికి తమను తాము సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 2 దేశాల మధ్య డిస్కషన్స్ జరుగుతుండగానే ద్వేషంతో ట్రంప్ దాడులు చేశారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మండిపడ్డారు. అణు చర్చలను రియల్ ఎస్టేట్ లావాదేవీల్లా మార్చారని ఫైరయ్యారు.
News March 4, 2026
తమిళనాట DMK-INC సీట్ల పంచాయితీ కొలిక్కి!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ DMK-INC మధ్య సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. INCకి 28-29 స్థానాలతోపాటు ఓ రాజ్యసభ సీటు ఇచ్చేందుకు DMK చీఫ్ స్టాలిన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు INC చీఫ్ ఖర్గే కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడనుందని పేర్కొన్నాయి. ఈసారి 35-40 సీట్ల కోసం కాంగ్రెస్ డిమాండ్ చేసిన విషయం <<19222432>>తెలిసిందే.<<>>


