News April 20, 2024
వాట్సాప్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు

వాట్సాప్‌లో పీపుల్ నియర్ బై, క్విక్ స్టేటస్ రియాక్షన్ అనే రెండు ఫీచర్లు రాబోతున్నాయి. పీపుల్ నియర్ బై ఫీచర్ ద్వారా మీకు దగ్గర్లో ఉన్న వారితో ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్‌లో ‘పీపుల్ నియర్ బై’ పై క్లిక్ చేసి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక క్విక్ స్టేటస్ రియాక్షన్ ఫీచర్ ద్వారా స్టేటస్ చూసిన దగ్గరే ఎమోజీలతో రియాక్ట్ అవ్వొచ్చు. ఆ రియాక్షన్స్ చాట్‌లో కాకుండా స్టేటస్ దగ్గరే కనిపిస్తాయి.
Similar News
News January 25, 2026
నేపియర్ కంటే 4G బుల్లెట్ సూపర్ నేపియర్ ఎందుకు ప్రత్యేకం?

నేపియర్ గడ్డి ముదిరితే కాండం కాస్త గట్టిగా ఉంటుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్ కాండం ముదిరినా లోపల డొల్లగా ఉండి, పాడి పశువు తినడానికి సులువుగా ఉంటుంది. నేపియర్‌తో పోలిస్తే దీనిలో తీపిదనం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ గడ్డి చాలా గుబురుగా పెరుగుతుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్‌లో ప్రొటీన్ కంటెంట్, దిగుబడి, మొక్కలు పెరిగే ఎత్తు, మొక్క ఆకుల్లోని మృదుత్వం.. సాధారణ నేపియర్ గడ్డి కంటే ఎక్కువగా ఉంటుంది.
News January 25, 2026
ఈ జిల్లాల్లో వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షం కురుస్తుందని పేర్కొంది. నిన్న రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. అటు పలు చోట్ల చలి తీవ్రత కొనసాగుతోంది.
News January 25, 2026
ఈరోజు మాంసాహారం తింటున్నారా?

నేడు సూర్యుడి జన్మదినం. ఈ రథసప్తమి ఆయనకు ప్రీతికరమైన ఆదివారంతో కలిసి వచ్చింది. అందుకే కొన్ని నియమాలు తప్పక పాటించాలంటున్నారు పండితులు. నేడు మాంసం తినడం, మద్యం తీసుకోవడం, జుట్టు/గోర్లు కత్తిరించుకోవడం అశుభమని హెచ్చరిస్తున్నారు. సూర్యుడిని ఆరాధిస్తూ ఆదిత్య హృదయం పఠిస్తే ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లుతారని చెబుతున్నారు. ఆదివారం నాడు నాన్‌వెజ్ ఎందుకు తినకూడదో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


