News October 11, 2025

సికింద్రాబాద్-కాజీపేట మధ్య మరో రెండు రైల్వే లైన్లు

image

సికింద్రాబాద్(మేడ్చల్-ఘట్‌కేసర్)-కాజీపేట మధ్య ₹2,837Cr అంచనా వ్యయంతో 3, 4వ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ లైన్ మేడ్చల్, యాదాద్రి, జనగామ, HNK మీదుగా 110kms దూరాన్ని కవర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ మార్గంలో జర్నీకి 2.5-3 గంటలు పడుతుండగా, లైన్ల నిర్మాణం పూర్తయితే గంట సమయం తగ్గనుంది. రైళ్ల వేగం 130-150km/hకి పెరిగే ఛాన్సుంది.

Similar News

News October 11, 2025

మొదటిసారి మేకప్ వేసుకుంటున్నారా?

image

కొత్తగా మేకప్ ప్రయత్నించాలనుకొనే వారికోసం ఈ చిట్కాలు. ముందు మీ స్కిన్ టైప్ ఏంటో గుర్తించాలి. డ్రై, ఆయిలీ, నార్మల్ ఇలా..దాన్ని బట్టి కాస్మెటిక్స్ ఎంచుకోవాలి. ముందు ముఖానికి మాయిశ్చరైజర్ రాయాలి. తర్వాత ఫౌండేషన్. ఇది మీ చర్మటోన్, టెక్స్‌చర్‌కు సరిపోయేలా ఉండాలి. డార్క్‌సర్కిల్స్‌కు కన్సీలర్ వాడాలి. కళ్లకు ఐలైనర్, కనురెప్పలకు మస్కారా, పెదాలకు లిప్‌లైనర్, లిప్‌స్టిక్ వేసుకోవాలి. <<-se>>#BeautyTips<<>>

News October 11, 2025

Colgate పేరుతో నకిలీ టూత్ పేస్టులు

image

ఇప్పటిదాకా కల్తీ పాలు, అల్లం పేస్టులు, ఆయిల్ ప్యాకెట్లు బయటపడగా తాజాగా నకిలీ టూత్ పేస్టులు కలకలం రేపుతున్నాయి. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో Colgate పేరుతో రెడీ చేసిన ఫేక్ టూత్ పేస్ట్ బాక్స్‌లు భారీగా బయటపడ్డాయి. చిత్రోడ్ ప్రాంతంలో పోలీసులు దాడులు చేసి వీటిని పట్టుకున్నారు. సుమారు రూ.9.43 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. దీని సప్లై చైన్ తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

News October 11, 2025

‘చిత్త కార్తె’ అంటే ఏంటి?

image

జ్యోతిష శాస్త్రం ప్రకారం అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు ప్రతి నక్షత్రంలో 13-14 రోజులు ఉంటాడు. ఏ నక్షత్రంలోకి ప్రవేశిస్తే ఆ కాలాన్ని ఆ కార్తె పేరుతో అని పిలుస్తారు. సమస్త ప్రాణకోటితో పాటు ప్రకృతి ప్రవర్తనలపై ఇవి ప్రభావం చూపుతాయి. భానుడు ఇవాళ చిత్త నక్షత్రంలోకి ప్రవేశిస్తుండటంతో చిత్త కార్తె ప్రారంభం అవుతోంది.
* ఇలాంటి ఆసక్తికర కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.