News June 11, 2024
BJP ముందు మరో రెండు టాస్క్‌లు
మంత్రివర్గ ఏర్పాటుతో కాస్త ఉపశమనం పొందినా BJP ముందు మరో 2 పనులు మిగిలి ఉన్నాయి. అవి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక, BJP జాతీయాధ్యక్షుడి ఎంపిక. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా కేబినెట్లోకి రావడంతో ఆ పోస్టు ఖాళీగా మారనుంది. నూతన అధ్యక్షుడి ఎంపిక తమ చేతుల్లోని వ్యవహారమే కావడంతో ఆ టాస్క్ పెద్ద కష్టమేం కాదు. కానీ, లోక్‌సభ స్పీకర్ ఎన్నిక మాత్రం అలా కాదు. ఆ పదవి కోసం ఇటు TDP, అటు JDU పోటీలో ఉన్నాయి.
Similar News
News December 23, 2024
పార్లమెంట్ సమావేశాల్లో ప్రొడక్టివిటీ లేదు: ఎంపీ భరత్
AP: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చూసిన తర్వాత తనకు బాధ కలిగిందని ఎంపీ శ్రీభరత్ చెప్పారు. రాజకీయ చర్చల వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సమావేశాల్లో ప్రొడక్టివిటీ లేదని అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.1,650 కోట్లు కేటాయించినప్పటికీ సరిపోవట్లేదని తెలిపారు. ఉద్యోగుల జీతాలు, మూడో బ్లాస్ ఫర్నేస్‌కు పెట్టుబడులపై ఆర్థిక మంత్రి దృష్టిసారించాలని కోరారు.
News December 23, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 23, 2024
2 రోజులు భూప్రకంపనలు.. మంత్రుల ఆరా
AP: ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో <<14949636>>భూప్రకంపనలు<<>> సంభవించడంపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయస్వామి ఆరా తీశారు. కలెక్టర్‌ను అడిగి సమాచారం తెలుసుకున్నారు. తరుచూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు, శాస్త్రవేత్తలతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని సూచించారు.