News September 22, 2025
రాష్ట్రానికి మరో రెండు వందేభారత్ రైళ్లు

TG: రాష్ట్రానికి మరో రెండు వందేభారత్ రైళ్లు మంజూరయ్యాయి. చర్లపల్లి-నాందేడ్, నాంపల్లి-పుణే మధ్య ఇవి రాకపోకలు సాగించనున్నాయి. త్వరలోనే ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా విశాఖకు రెండు, తిరుపతి, బెంగళూరు, నాగపూర్‌కి ఒకటి చొప్పున 5 రైళ్లు నడుస్తుండగా.. కొత్తగా రెండు సర్వీసులు యాడ్ కానున్నాయి.
Similar News
News September 22, 2025
ప్రైవేటుగా పరువాల విందు!

SMలో ఇప్పుడు చాలామంది మహిళా సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు చేస్తున్న వ్యాపారం ఇదే. ‘ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి’ అంటూ బోల్డ్ ఫొటోలు పెట్టి యువతను రెచ్చగొడుతున్నారు. ఇందుకు నెలకు రూ.499/రూ.599 చొప్పున వసూలు చేస్తున్నారు. ‘ఎక్స్‌క్లూజివ్’ అంటే ఏముంటుందో అనే ఆశతో చాలామంది యువకులు సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు. దీంతో ఆయా సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు లక్షల్లో సంపాదిస్తున్నారు.
News September 22, 2025
అన్ని నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు: మంత్రి లోకేశ్

AP: అమరావతిలో రూ.150కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో లైబ్రరీ నిర్మాణాన్ని చేపడుతున్నామని, 24నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘కొత్త జిల్లాల ప్రాతిపదికన 26 జిల్లా గ్రంథాలయాలు, 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు తెస్తాం. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన అన్ని పుస్తకాలను అందుబాటులోకి తెస్తాం. మోడల్ లైబ్రరీలకు సంబంధించిన యాప్‌ను 100 రోజుల్లో ఆవిష్కరిస్తాం’ అని అసెంబ్లీలో అన్నారు.
News September 22, 2025
ప్రభాకర్‌రావు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, మాజీ IPS ప్రభాకర్‌రావు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు OCT 8కి వాయిదా వేసింది. ప్రభాకర్‌రావు సిట్ దర్యాప్తుకు సహకరించడం లేదని, జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో విచారణకు సహకరించాలని కోర్టు ప్రభాకర్‌రావును ఆదేశించింది. 2 వారాల గడువు కావాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరడంతో విచారణ వాయిదా వేసింది.