News August 29, 2024

వైసీపీకి ఇద్దరు ఎంపీల రాజీనామా

image

AP: ఇద్దరు వైసీపీ రాజ్యసభ ఎంపీలు పార్టీకి, తమ పదవులకు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్ ధన్‌ఖడ్‌కు సమర్పించారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 7, 2025

రేపు స్కూళ్లకు సెలవు లేదు: డీఈవోలు

image

AP: ఇటీవల ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో పలు జిల్లాల్లోని స్కూళ్లకు వరుస సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటికి బదులుగా రెండో శనివారాల్లో పాఠశాలలు నడపాలని డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఏలూరు, బాపట్ల, విశాఖలో స్కూళ్లు యథావిధిగా తెరుచుకోనున్నాయి. అలాగే DEC 13, FEB 14న కూడా పాఠశాలలు పనిచేయనున్నాయి. మీకూ రేపు స్కూల్ ఉందా? COMMENT

News November 7, 2025

₹4 లక్షలు పెద్ద అమౌంటే కదా: షమీ మాజీ భార్యకు సుప్రీం ప్రశ్న

image

భారత క్రికెటర్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ₹1.5లక్షలు, కూతురికి ₹2.5లక్షలు నెలవారీ భరణంగా ఇవ్వాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు. షమీ సంపాదనను దృష్టిలో ఉంచుకుని అమౌంట్‌ను పెంచాలని కోరారు. దీంతో షమీ, బెంగాల్ ప్రభుత్వానికి SC నోటీసులు జారీ చేసింది. ‘ఇప్పటికే ఇస్తున్న ₹4L పెద్ద అమౌంటే కదా’ అని జహాన్‌ను ప్రశ్నించింది. విచారణను DECకు వాయిదా వేసింది.

News November 7, 2025

బండి సంజయ్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

image

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఈవోను పీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ కోరింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పింది. మతం ఆధారంగా ఓటు వేయాలని సంజయ్ కోరారని, ఎన్నికల నిబంధలను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొంది.