News July 1, 2024
ప్రధాన కోచ్ రేసులో ఇద్దరి పేర్లు షార్ట్ లిస్ట్: జైషా

టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రేసులో ఇద్దరి పేర్లు షార్ట్ లిస్ట్ చేసినట్లు BCCI సెక్రటరీ జైషా తెలిపారు. ‘కోచ్, సెలక్టర్ నియామకం త్వరలోనే జరుగుతుంది. CAC నిర్ణయించిన పేర్లను ప్రకటిస్తాం. జింబాబ్వేకు వెళ్లే జట్టుతో లక్ష్మణ్ కోచ్‌గా వెళ్తారు. కొత్త కోచ్ శ్రీలంక సిరీస్‌తో జాయిన్ అవుతారు’ అని పేర్కొన్నారు. కాగా గంభీర్‌ను కోచ్‌గా ఎంపిక చేశారనే ప్రచారం నడుమ జైషా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Similar News
News April 19, 2026
US ఆర్మీని ఓడించడానికి సిద్ధం: మొజ్తబా

ఇరాన్-అమెరికా వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఓవైపు చర్చలకు సిద్ధమంటూనే <<19685626>>రెచ్చగొట్టే<<>> పనిలో ఇరు దేశాల నాయకులు ఉన్నారు. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను US ఇప్పటికీ దిగ్బంధిస్తుండటంతో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా బలగాలను ఘోరంగా ఓడించడానికి టెహ్రాన్ నేవీ సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఇవాళ మళ్లీ <<19682480>>మూసేసిన<<>> విషయం తెలిసిందే.
News April 19, 2026
RCBకి శాపంగా గ్రీన్ జెర్సీ!

ఆర్సీబీకి మరోసారి గ్రీన్ జెర్సీ కలిసి రాలేదు. పర్యావరణ పరిరక్షణ కోసం 2011 సీజన్ నుంచి బెంగళూరు ప్లేయర్లు ఒక్కో మ్యాచులో ఈ గ్రీన్ కలర్ జెర్సీ ధరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ జెర్సీలో 15 మ్యాచులు ఆడగా అందులో తొమ్మిదింట్లో (ఇవాళ ఢిల్లీతో కలిపి) ఓడింది. ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆడిన తొలి, 50వ, 100వ మ్యాచుల్లో ఓటమిపాలు కావడం గమనార్హం.
News April 18, 2026
జర్నీలో వాంతులు చేసుకుంటున్నారా?

చెవిలో ఉండే లాబ్రింథ్స్, యూట్రికెల్ భాగాలు మెదడుకు సంకేతాలు సరిగా అందించకపోతే ప్రయాణాల్లో వాంతులు చేసుకోవడం, కళ్లు తిరగడం లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. వెనుక సీట్లో బదులు ముందు కూర్చోవాలని సూచిస్తున్నారు. విండో తెరిచి స్వచ్ఛమైన గాలికి సేద తీరాలంటున్నారు. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని, తులసి ఆకులను నమలాలని సూచిస్తున్నారు. అల్లం టీ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుందంటున్నారు.


