News August 19, 2024

వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు అమలు!

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం దసరాకు మరో రెండు పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం, రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేసే పనిలో పడింది. ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 లక్షల ఆర్థిక సాయంపై క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇక రైతు భరోసా విషయంలోనూ మేధావులతో చర్చించి గైడ్‌లైన్స్ ఖరారు చేయనుంది. మరోవైపు రైతు కూలీలకు ఆర్థిక సాయంపైనా మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.

Similar News

News July 8, 2025

మెగా DSCపై తప్పుడు ప్రచారాలు: విద్యాశాఖ

image

AP: మెగా DSC అభ్యర్థులు పరీక్షలపై వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ‘కొన్ని పత్రికలు, SMలో పరీక్షలపై నిరాధార ఆరోపణలు వచ్చాయి. సాఫ్ట‌వేర్ లోపాలు, జవాబు మార్పులు వంటి ఆరోపణలు ధ్రువీకరణ కాలేదు. అధికారిక సమాచారంలేని ప్రచారాలు నమ్మొద్దు. అభ్యర్థుల సహాయం కోసం 8125046997, 7995649286, 7995789286, 9398810958 హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి’ అని పేర్కొంది.

News July 8, 2025

నేరాల నిరూపణకు టెక్నాలజీ వాడాలి: చంద్రబాబు

image

AP: RTGS రివ్యూలో CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. నేరాల నిరూపణకు టెక్నాలజీని వినియోగించాలి. కొందరు తెలివిగా నేరాలు చేసి ప్రభుత్వంపై నెపం వేస్తున్నారు. పోలీసులకు సహకరించని వారి విషయంలో అలర్ట్‌గా ఉండాలి. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద వారి నుంచి డేటా సేకరణకు చర్యలు చేపట్టాలి. నేరం చేసిన వారిని బాధ్యులను చేసే అంశంపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు.

News July 8, 2025

నిధికి పెళ్లి ప్రపోజల్.. హీరోయిన్ క్యూట్ రిప్లై

image

సాధారణంగా సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ తారలు నెట్టింట అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. అలాగే, హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా #asknidhhi అంటూ ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశారు. నెటిజన్స్ అంతా నిధి హీరోయిన్‌గా చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా విశేషాలు అడిగారు. ఒకరు మాత్రం ‘మీ అమ్మగారి నంబరిస్తే మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతా’ అని అన్నారు. అందుకు నిధి ‘అవునా? నాటీ’ అంటూ క్యూట్‌గా రిప్లయ్ ఇచ్చారు.