News June 27, 2024
డీఎస్సీకి రెండు నోటిఫికేషన్లు?

AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను రెండు రకాలుగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి ఓ నోటిఫికేషన్, ఇప్పటికే టెట్‌లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డీఎస్సీకి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చూస్తోందట. ఈ నెల 30న నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. డిసెంబర్ 10 నాటికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు వచ్చేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 20, 2025
పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

ప్రస్తుతకాలంలో పిల్లల్లోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో హైబీపీ ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో బీపీ ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి బీపీ చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.
News November 20, 2025
పిల్లల్లో బీపీ ఉంటే ఎన్నో దుష్ప్రభావాలు

దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడే పిల్లలకు గుండె కండరం మందం అయి గుండె వైఫల్యానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. కిడ్నీలో రక్తనాళాలు దెబ్బతిని, వడపోత ప్రక్రియ అస్తవ్యస్తమవ్వచ్చు. కంట్లోని రెటీనా దెబ్బతినడం, మెదడుకు రక్త సరఫరా చేసే నాళాలు దెబ్బతిని తలనొప్పి, తలతిప్పు తలెత్తచ్చంటున్నారు. అంతేకాకుండా, రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వంటి తీవ్ర సమస్యలూ ముంచుకురావొచ్చని వివరిస్తున్నారు.
News November 20, 2025
బాబు లుక్స్ అదిరిపోయాయిగా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘వారణాసి’ మూవీ కోసం హైదరాబాద్‌లో హాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. బాబు కోసం హాలీవుడ్ HYDకు వచ్చిందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ఆయన లుక్స్ అదిరిపోయాయని, మూవీ విడుదలయ్యే వరకు ఇలా ఫొటోల్లో కనిపించినా చాలని మరికొందరు అంటున్నారు.


