News July 26, 2024
సీఎంగా రెండే ప్రెస్మీట్లు.. ఇప్పుడేమో: లోకేశ్

AP: రెడ్ బుక్ తెరవకముందే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని మంత్రి లోకేశ్ ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఐదేళ్ల పాలనలో 2 సార్లే ప్రెస్మీట్ పెట్టిన జగన్.. ఇప్పుడు నెలరోజుల వ్యవధిలో 5సార్లు మీడియాతో మాట్లాడారన్నారు. జగన్ తాను చెప్పే అబద్దాలు అసెంబ్లీకి వచ్చి చెప్పాలన్నారు. వాటిలో నిజానిజాలను తాము ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
Similar News
News November 17, 2025
నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.
News November 17, 2025
న్యూస్ రౌండప్

⋆ కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ
⋆ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
⋆ నేడు మ.3 గంటలకు TG క్యాబినెట్ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలు, అందెశ్రీ స్మృతి వనం, అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం
⋆ నేడు T BJP నేతల కీలక భేటీ.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చ
⋆ లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో నేడు CBI విచారణకు పుట్ట మధు
News November 17, 2025
నువ్వుల పంట కోతకు వచ్చిందా?

తెలుగు రాష్ట్రాల్లో ఆగష్టు నెలలో విత్తుకున్న నువ్వుల పంట ప్రస్తుతం కోత మరియు నూర్పిడి దశలో ఉంటుంది. పంటలో 75% కాయలు లేత పసుపు రంగులోకి వచ్చినప్పుడే పైరును కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ 8 శాతానికి తగ్గేవరకు చూసుకోవాలి. ఆ తరువాతే గోనె సంచిలో నిల్వ చేయాలి. ఈ సంచులపై మలాథియాన్ పొడిని చల్లాలి.


