News December 13, 2024
మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు

TG: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా రెండేసి చీరల చొప్పున పంపిణీ చేయనుంది. అందరికీ ఒకేరకమైన యూనిఫాం చీరలను అందజేయనుంది. డిజైన్తో పాటు వీటిపై ఇందిరా మహిళా శక్తి పథకం లోగో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటి నమూనాలను మంత్రి సీతక్క పరిశీలించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చీరలను ఫైనలైజ్ చేయనున్నారు.
Similar News
News January 5, 2026
ESIC నవీ ముంబైలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 5, 2026
సెంచరీలు బాదడంలో ఇతని ‘రూటే’ సపరేటు!

ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ టెస్టుల్లో నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదుతున్నారు. 2021 నుంచి అతను ఏకంగా 24 శతకాలు కొట్టడమే దీనికి నిదర్శనం. రూట్ తర్వాత ప్లేస్లో నలుగురు ప్లేయర్లు ఉండగా, వారిలో ఒక్కొక్కరు చేసిన సెంచరీలు 10 మాత్రమే. ఈ ఫార్మాట్ ఆడుతున్న యాక్టివ్ ప్లేయర్లలో సచిన్ టెస్ట్ సెంచరీల(51) రికార్డును బద్దలు కొట్టే సత్తా ప్రస్తుతం రూట్కే ఉంది. తాజాగా యాషెస్లో ఆయన 41వ సెంచరీ సాధించారు.
News January 5, 2026
అమెరికా దాడిలో మదురో సెక్యూరిటీ టీమ్ క్లోజ్!

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించే క్రమంలో అమెరికా సైన్యం జరిపిన ఆపరేషన్ పెను విధ్వంసానికి దారితీసింది. ఈ దాడిలో మదురో సెక్యూరిటీ టీమ్లో మెజారిటీ సభ్యులు చనిపోయినట్లు ఆ దేశ రక్షణ మంత్రి పాడ్రినో సంచలన ప్రకటన చేశారు. US బలగాలు ‘కోల్డ్ బ్లడెడ్’గా తమ సైనికులు, అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్నాయని ఆరోపించారు. తమ నేతను వెంటనే విడుదల చేయాలని వెనిజులా సైన్యం డిమాండ్ చేసింది.


