News February 21, 2025

మహిళలకు ఏడాదికి రెండు చీరలు: CM

image

TG: మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి రెండు నాణ్యమైన చీరలు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘మొదటగా ప్రతి జిల్లాలో ఒక చోట ప్రభుత్వ భూముల్లో మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తాం. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున ఉండేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

Similar News

News November 27, 2025

PDPL: ‘అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి’

image

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభివృద్ధి పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని అన్నారు. ఆయన రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం మండలాల్లోని పంచాయతీరాజ్, ఆర్&బీ శాఖ పనులను సమీక్షించారు. వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రి నిర్మాణం, సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News November 27, 2025

ఆ బంగ్లాను రబ్రీదేవి ఖాళీ చేయరు: RJD

image

RJD చీఫ్ లాలూ భార్య రబ్రీదేవి ఉంటున్న నివాసాన్ని ఆమె ఖాళీ చేయరని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఆ పార్టీ బిహార్ చీఫ్ మంగానీ లాల్ మండల్ తెలిపారు. జీవితకాల నివాసం కింద ఆ బంగ్లాను కేటాయించినట్లు చెప్పారు. పట్నాలోని అన్నే మార్గ్‌లో CM నివాసం ఎదుట రబ్రీదేవి, లాలూ 2 దశాబ్దాలుగా ఉంటున్నారు. కాగా దాన్ని ఖాళీ చేసి హార్డింజ్ రోడ్ 39 బంగ్లాకు మారాలంటూ ఇటీవల నితీశ్ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా RJD స్పందించింది.

News November 27, 2025

హైడ్రాపై కర్ణాటక బృందం ప్రశంసలు

image

TG: హైడ్రా (HYDRAA) చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించిన కర్ణాటక ప్రతినిధులు ఈ మోడల్‌ను బెంగళూరుతో పాటు ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా పేర్కొన్నారు. బతుకమ్మకుంట, నల్లచెరువు వంటి పునరుద్ధరించిన చెరువులను పరిశీలించారు. ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణలో హైడ్రా చేపట్టిన చర్యలను ప్రశంసించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో జరిగిన చర్చలో దీని అమలు విధానం, విభాగాల సమన్వయం గురించి తెలుసుకున్నారు.