News October 26, 2024
IFFIలో ప్రదర్శనకు రెండు తెలుగు సినిమాలు

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 55వ ఎడిషన్లో ప్రదర్శనకు రెండు తెలుగు సినిమాలు (కల్కి 2898 AD, 35 చిన్న కథ కాదు) ఎంపికయ్యాయి. వీటితో పాటు 12th ఫెయిల్, ఆర్టికల్ 370, స్వాతంత్య్ర వీర్ సావర్కర్(హిందీ), మంజుమ్మల్ బాయ్స్, భ్రమయుగం, ఆడు జీవితం(మలయాళం), జిగర్తాండ డబుల్ ఎక్స్(తమిళ) వంటి మరికొన్ని సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఈ ఫెస్టివల్ గోవాలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనుంది.
Similar News
News November 25, 2025
బలవంతపు వాంతులతో క్యాన్సర్: వైద్యులు

బ్రష్ చేశాక చాలా మంది గొంతులోకి వేళ్లు పెట్టి బలవంతంగా వాంతులు చేసుకుంటారు. అలా పదే పదే చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కడుపులోని యాసిడ్ పదేపదే పైకి తన్నడం వల్ల అన్నవాహికలోని ‘టైల్స్’ లాంటి సున్నితమైన కణాలు అరిగిపోతాయి. ఇలా మాటిమాటికీ జరిగితే తీవ్రమైన సందర్భాల్లో క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంటుంది. నాలుకను గీసుకొని ముఖం కడుక్కుంటే చాలు’ అని సూచించారు.
News November 25, 2025
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని, రాబోయే 24 గంటల్లో ఇది బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మరోవైపు మలక్కా జలసంధి వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని పేర్కొంది. వీటి ప్రభావంతో NOV 29 నుంచి DEC 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
News November 25, 2025
ఆంధ్ర అరటికి.. ఆజాద్పుర్ మండీ వ్యాపారుల హామీ

AP: అరటి ధర పతనంతో కొందరు రైతులు పండిన పంటను చెట్లకే వదిలేశారు. మరి కొందరు పశువులకు మేతగా వేశారు. ఈ తరుణంలో AP నుంచి నాణ్యమైన అరటిని కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీలోని ఆజాద్పుర్ మండీ పండ్ల వ్యాపారులు హామీ ఇచ్చారు. AP అధికారులు నిన్న ఢిల్లీలో ‘బయ్యర్ సెల్లర్స్ మీట్’ నిర్వహించి అక్కడి వ్యాపారులతో చర్చించగా.. 10-15 రోజుల్లో AP నుంచి అరటిని కొంటామని ఆజాద్పుర్ మండీ వ్యాపారులు హామీ ఇచ్చారు.


