News August 30, 2024
ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.
Similar News
News January 26, 2026
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ రద్దు: ఎస్పీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26 సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు. తదుపరి సోమవారం నుంచి ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.
News January 26, 2026
జుక్కల్లో చిరుత సంచారం.. 5 గ్రామాలకు హెచ్చరిక

జుక్కల్ మండలంలోని 5 గ్రామాల పరిధిలో చిరుత పులి సంచరిస్తుండటంతో అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు చిరుత అడుగుజాడలను గుర్తించారు. ముఖ్యంగా పొలాల వద్దకు, వ్యవసాయ బావుల దగ్గరకు వెళ్లే రైతులు, కూలీలు సమూహాలుగా వెళ్లాలని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
News January 26, 2026
నేటి ముఖ్యాంశాలు

* 131 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
* అంతరిక్ష యాత్ర పూర్తిచేసిన శుభాంశు శుక్లాకు అశోక చక్ర
* అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
* TG: సింగరేణి టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధం: కోమటిరెడ్డి
* నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి.. రూ.5 లక్షల చొప్పున పరిహారం
* సింగరేణిలో మిగిలిన స్కామ్లను బయటపెడతాం: హరీశ్ రావు
* న్యూజిలాండ్పై మూడో T20Iలో భారత్ విజయం


