News April 14, 2025

ట్రైన్ వెయిటింగ్ లిస్టులో రకాలు..

image

*వెయిటింగ్ లిస్టు (WL): ఇది సాధారణంగా ఉండేది.
*జనరల్ (GNWL): ట్రైన్ స్టార్ట్ అయ్యే/దగ్గరి స్టేషన్ నుంచి ప్రయాణించే వారు ఈ లిస్టులో ఉంటారు.
*పూల్డ్ కోటా (PQWL): ట్రైన్ రూట్ మధ్యలో ఉండే స్టేషన్స్‌లో ఎక్కేవారికి ఈ లిస్ట్ వర్తిస్తుంది.
*రోడ్ సైడ్ స్టేషన్ (RSWL): చిన్న, రోడ్డుసైడ్ స్టేషన్స్ నుంచి ఎక్కేవారికి,
>GNWLలో టికెట్స్ కన్ఫమ్ అయ్యే అవకాశం ఎక్కువగా
ఉంటుందట.

Similar News

News April 15, 2025

పంజాబ్‌పై వికెట్ల‘కింగ్’గా ఆవిర్భవించిన నరైన్!

image

ముల్లాన్‌పూర్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ నరైన్ ఐపీఎల్ రికార్డులకెక్కారు. ఈ మ్యాచ్‌లో ఆయన 2 వికెట్లు తీశారు. ఈక్రమంలో ఆ జట్టుపై ఆయన తీసిన మొత్తం వికెట్ల సంఖ్య 36కు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలరైనా ఓ ప్రత్యర్థి జట్టుపై ఇన్ని వికెట్లు తీయడం ఇదే అత్యధికం.

News April 15, 2025

ALERT.. కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షం పడుతుందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, నిజామాబాద్ జిల్లాల్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. వీటితో పాటు గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీచేసింది.

News April 15, 2025

ముంబై ఫెయిల్యూర్‌కు రోహితే కారణం: మాజీ క్రికెటర్

image

ఓపెనర్‌గా రోహిత్ శర్మ రాణించకపోవడం కారణంగానే ముంబై ఇండియన్స్ ఫెయిల్ అవుతోందని భారత మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా వ్యాఖ్యానించారు. ముంబై పైచేయి సాధించాలంటే హిట్‌మ్యాన్ దూకుడుగా ఆడాలన్నారు. కాగా రోహిత్ ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌ల్లో 0, 8, 13, 17, 18 పరుగులు మాత్రమే చేశారు. MI ఆరు మ్యాచ్‌ల్లో 4 ఓడిపోయి పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానంలో ఉంది.

error: Content is protected !!