News December 2, 2024
తుఫాన్ ఎఫెక్ట్.. 11వేల ఎకరాల్లో పంట నష్టం

AP: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చాయి. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కోనసీమ జిల్లాల్లోని 11,157 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 10,426 ఎకరాలు వరి, 501 ఎకరాలు వేరు శనగ, 180 ఎకరాల్లో మినుము ఉన్నట్లు పేర్కొంది. కృష్ణా జిల్లాలో వర్షాలు, గాలుల ధాటికి 19,500 ఎకరాల్లో వరి నేలవాలినట్లు తెలిపింది.
Similar News
News March 24, 2026
తగ్గిన అమెరికా వీసాలు.. భారత్, చైనాపైనే ప్రభావం

ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన రూల్స్ వల్ల అమెరికా వీసాల జారీ భారీగా తగ్గింది. భారత్, చైనా పౌరులపై ఈ ప్రభావం అధికంగా ఉంది. గతేడాది కేవలం 2.5 లక్షల వీసాలే జారీ చేయగా శాశ్వత, తాత్కాలిక నివాస వీసాల్లో 11% తగ్గించారు. ముఖ్యంగా భారత్, చైనాలకు సంబంధించి 84 వేల వీసాలు తగ్గడంతో అక్కడికి వెళ్లే విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
News March 24, 2026
ఆర్టీసీలో సమ్మె హెచ్చరికలు.. రేపు చర్చలు

TG: తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 26 తర్వాత సమ్మెకు దిగుతామని RTC JAC హెచ్చరించడంతో ప్రభుత్వం స్పందించింది. రేపు HYDలోని అంజయ్య భవన్‌లో చర్చలకు రావాలని సంస్థ ప్రతినిధులు, JAC ప్రతినిధులను ఆహ్వానించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంస్థలోకి యూనియన్ల అనుమతి, 2021, 2025 జీత భత్యాల సవరణ, డ్రైవర్లు, కండక్టర్ల ఉద్యోగ భద్రతపై మార్గదర్శకాలు, బకాయిలను విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
News March 24, 2026
కురులు ఆరోగ్యంగా ఉండాలంటే..

మనం తినే ఆహారం ద్వారా చేరే పోషకాలను శరీరం ప్రధాన అంతర్గత అవయవాల కోసం కేటాయిస్తుంది. వాటిలో మిగిలినవి మాత్రమే వెంట్రుకలు, గోళ్లకు వెళ్తాయి. సరిపడా పోషకాలు తీసుకోకపోతే వెంట్రుకల మీద ఆ ప్రభావం పడి, రాలిపోతూ ఉంటాయి. కాబట్టి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారంతోపాటు, విటమిన్ ఇ, డి, సి, బి – కాంప్లెక్స్ అందేలా చూసుకోవాలి. ఇందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృత్తులు సరిపడా అందించాలి.


