News November 30, 2024

తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు ఆకస్మిక వరదలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News January 22, 2026

గ్రీన్‌లాండ్‌ స్ట్రాటజిక్ లొకేషన్.. ట్రంప్ ప్రేమకు కారణమిదే!

image

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్నేయడానికి ప్రధాన కారణం దాని స్ట్రాటజిక్ లొకేషన్. ఆర్కిటిక్ రీజియన్‌లో అది ఒక గేట్ వే లాంటిది. అక్కడ USకు చెందిన పిటుఫిక్ స్పేస్ బేస్ ఉంది. ఇది రష్యా కదలికలను గమనించడానికి చాలా కీలకం. అలాగే మంచు కరుగుతుండటంతో కొత్త షిప్పింగ్ రూట్స్ ఓపెన్ అవుతాయి. ఇవి బిజినెస్‌కి ప్లస్ పాయింట్. అక్కడ భారీగా అరుదైన భూ మూలకాలు, బంగారం, ఆయిల్ నిక్షేపాలూ ఉన్నాయి.

News January 22, 2026

‘భగవంత్ కేసరి’ బిగ్ హిట్ కావాల్సింది: అనిల్

image

తన కెరీర్‌లో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్‌లలో బాలకృష్ణతో చేసిన ‘భగవంత్ కేసరి’ ఒకటని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ‘ఈ మూవీ భారీ విజయం సాధించాల్సింది. విడుదలైన సమయంలో చంద్రబాబు జైలులో ఉండటంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. సాధారణ ప్రేక్షకులు మూవీని హిట్ చేశారు. పరిస్థితులు బాగుంటే మరింతగా హిట్ అయ్యేది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ మూవీకి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది.

News January 22, 2026

సిజేరియన్ తర్వాత ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

ప్రస్తుతం సిజేరియన్ డెలివరీలు సర్వసాధారణమైపోయాయి. దీన్నుంచి కోలుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సిజేరియన్ తర్వాత తల్లులు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా కోలుకుంటారు. రెండు వారాల పాటు ఎక్కువ బరువున్న వస్తువులను ఎత్తకూడదు. పాలిచ్చేటపుడు ముందుకు వంగకుండా నిటారుగా కూర్చోవాలి. పోషకాలు లభించే పదార్థాలు తీసుకుంటే సిజేరియన్ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చని సలహా ఇస్తున్నారు.