News December 1, 2024
తుఫాన్.. తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
TG: ఫెంగల్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40-50kms వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ భద్రాద్రి, ఖమ్మం, NLG, SRPT, MBNR, నాగర్ కర్నూల్, WNP, నారాయణపేట, గద్వాల్ జిల్లాలకు, రేపు MBNR, WGL, HNK, జనగామ, SDPT, భద్రాద్రి, KMM, NLG, SRPT, NGKL, MHBD, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News December 1, 2024
గ్యాస్ సిలిండర్ ధర పెంపు
ప్రతినెలా మొదటి రోజున ఎల్పీజీ ధరల్లో మార్పులు చేసే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ రేట్లు పెంచాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలను రూ.16.5 మేర పెంచాయి. 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లలో మార్పులు చేయలేదు. ప్రస్తుతం HYDలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,044, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.855గా ఉన్నాయి.
News December 1, 2024
పాపం సాయితేజ.. స్నేహితుడి డ్యూటీ చేస్తూ..
అమెరికాలో ఖమ్మంకు చెందిన <<14748888>>సాయితేజ<<>> (26) అనే విద్యార్థిని దుండుగులు హత్య చేయడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. చికాగోలో ఎంబీఏ చదువుతున్న అతడు ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. డ్యూటీ ముగిసినా స్నేహితుడు నమాజ్కు వెళ్తానని చెప్పడంతో సాయితేజ అక్కడే ఉండిపోయాడు. ఈ సమయంలోనే దుండగులు డబ్బులు ఇవ్వాలని తుపాకులతో బెదిరించారు. డబ్బులిచ్చినా చంపేసి వెళ్లిపోయారు.
News December 1, 2024
తిరుమలలో రూం దొరకాలంటే..
AP: తిరుమలకు వెళ్తే గదులు దొరక్క చాలా మంది ఇబ్బంది పడతారు. తిరుమల కొండపై ఉన్న7,500 గదుల్లో 50% ఆన్లైన్లో ఉంటాయి. మిగతా 50% రూంలను తిరుమలలోని CRO ఆఫీసుకు వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ఉ.5 గంటల నుంచి దర్శన టికెట్లు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తదితర వివరాలు ఇస్తే 1-4 గంటల్లో గది కేటాయిస్తారు. రూ.50, రూ.100, రూ.1000 గదులు ఉంటాయి. మ.12 గంటల తర్వాత వెళ్తే రూంలు దొరికే అవకాశం చాలా తక్కువ.
SHARE IT