News September 27, 2024
హైడ్రా పేరుతో దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదు: ఈటల

TG: హైడ్రా పేరుతో ప్రజలపై దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని చెప్పారు. కూల్చివేతల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా సీఎం రేవంత్ చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.లక్షలు పెట్టి ఇళ్లు కొన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామనడం సరికాదన్నారు. ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిన విషయం మరువొద్దన్నారు. కూల్చివేతలపై కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు.
Similar News
News November 24, 2025
శత జయంతి ఉత్సవాలు బ్లాక్బస్టర్!

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.
News November 24, 2025
118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

<


